Saturday, October 31, 2009

నోబెల్ యుద్ధ పురస్కారం

2009 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఏ రంగంలోనూ పరిగణింపదగిన విజయాలేవీ లేకపోగా – పురస్కారానికి ఎంపిక గడువు తేదీకి పదకొండు రోజులుండగా మాత్రమే అధ్యక్షుడైన వ్యక్తిని , అధ్యక్షుడు కాకముందు అతనెవరోకూడా మెజారిటీ అమెరికా ప్రజలకే తెలియని వ్యక్తిని, పాకీస్తాను గ్రామాలపై బాంబులు వేసి, పౌరుల హత్యను “ అనుబంధ నష్టం “ గా కొట్టివేసిన వ్యక్తిని, ఈ పురస్కారానికి ఎంపిక చేయటం నోబుల్ శాంతి పురస్కారాలు సంకుచిత రాజకీయాలతో కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది.
పురస్కారాన్ని ప్రకటిస్తూ నోబుల్ కమిటీ “ అణ్వాయుధాలు లేని స్వచ్చా ప్రపంచమన్న ఒబామా దార్శినికత ”ను ప్రశంసించింది. అయితే ఈ ప్రకటన ఎంత వైవిద్యపూరితమంటే, ఒబామా అధ్యక్షుడైన తరునాత నిరాయుధీకరణపై రష్యాతో జరిపిన చర్చలు నిరాయుధీకరణం జరిగిన తర్వాత 1500 ఆణ్వాయుధాలు కలిగి ఉంటానని అమెరికా మంకు పట్టు పట్టినందువల్ల విఫలం అయ్యాయి.
పురస్కారానికి ధన్యవాదాలు తెలుపుతూ శ్వేత సౌధంలోని గులాబి తోటలో విలేఖరుల సమావేశంలో ఒబామా " ఆశ్ఛర్య చకితుడిని మరింత వినమృడిని అయ్యానంటూ" అణ్వాయుధాలు లేని ప్రపంచమన్న తన లక్ష్యం తన జీవితకాలంలో నెరవేరదని అన్నాడు.

3 comments:

Praveen Mandangi said...

చెంఘీజ్ ఖాన్, తామర్లేన్ లాంటి నరరూప రాక్షసులు మనకి ఆదర్శ మూర్తులైతే జార్జ్ బుష్, ఒబామా లాంటి సామ్రాజ్యవాదులు కూడా మనకి ఆదర్శ మూర్తులే.

కెక్యూబ్ వర్మ said...

ఈ ప్రకటన వైవిధ్య పూరితం కాదు వైరుధ్య పూరితం. అసలు అ౦దుకు౦టున్నవాడే ఆశ్చర్యపోయాడంటే ఇది ఎ౦త హాస్యాస్పద నిర్ణయమోకదా? అసలు శాంతి పురస్కారాలు వారి దోపిడీ నిర్ణయాలకు అనుకూలమైనవారికే ఇస్తున్నారు చాన్నాళ్ళుగా.

చెంఘీజ్ ఖాన్ గురించి మరల చదవండి. తన జాతిని కాపాడుకునే క్రమంలో చైనా సాగించిన నాటి కౄర రాజరిక పాలన(నేటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి మల్లే)కు వ్యతిరేకంగా పోరాడాడు.

Praveen Mandangi said...

మంగోల్ సామ్రాజ్యవాదులు పోలాండ్ ని కూడా ఎందుకు ఆక్రమించుకున్నారు? చెంఘీజ్ ఖాన్ సామ్రాజ్యవాదే కానీ అమెరికా సామ్రాజ్యవాదులు చెంఘీజ్ ఖాన్, తామర్లేన్ లని మించిన నరహంతకులు.