Thursday, January 12, 2012

జనశక్తి-5-1-2012



                                  గుర్రం విజయకుమార్   ఏపిఎప్ టియు


కార్మిక, రైతాంగ ఐక్యత పునాదిగా మనదేశవిప్లవం పురోగమించాలి :
విశాఖపట్నం 18-12-2011 శ్రీనివాస రైల్వే కళ్యాణ మంటపంలో అఖిల భారత కార్మిక, రైతుకూలీ సమ్మేళనం జరిగింది. APFTU రాష్ట్ర నాయకులు కామ్రెడ్. గుర్రం విజయకుమార్ ప్రతినిధులకు స్వాగతం పలికారు. పి.కె.షాహి, కె.కోటయ్య అధ్యక్షులు.

                                           పి.జస్వంతరావు జనశక్తి పత్రిక సంపాదకుడు


పి.జస్వంతరావు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందడం లేదని , గత 15 సంవత్సరాలలో రెండున్నర లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 70 లక్షల మంది వ్యవసాయం నుండి గెంటివేయబడ్డారని, ప్రజలు పట్టణాలకు పనులకై వలసలు పోతున్నారని, ప్రభుత్వ ప్రయివేటు సంస్థలలో రోజుకు 8 గంటలకు బదులుగా 14 గంటల పని చేయిస్తున్నారని, కనీసం సంఘం పెట్టుకునే హక్కుకూడా లేదని, ఆదివాసులను అడవినుండి గెంటివేస్తున్నారని,  సమర్ధుడైనవ్యక్తిని నాయకునిగా ఎన్నుకుంటే సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పారు.

                                               అరవింద్ సిన్హా
అరవింద సిన్హా మాట్లాడుతూ అమెరికా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకోసం వివిధ దేశాలపై ఆర్ధిక వాణిజ్య షరతులు విధించుట, సైనిక దాడులు చేయుట వంటి పనులు చేస్తుంది. ప్రపంచవ్యాపితంగా అనేక దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని అవన్నీ పెట్టుబడిదారీ విధానంవలననే వచ్చాయని కనుక సోషలిజం మాత్రమే దీనికి పరిష్కారమని , దానికై అందర్నీ సమైక్యపరచాలని పోరాడాలని పిలుపునిచ్చాడు.

                                                     సుబోద్ మిత్రా
సుబోద్ మిత్రా మాట్లాడుతూ 1947 కు ముందు బ్రిటిష్ వారు మన దేశం నుండి దోచిన దానికంటే అధికంగా నేటి పాలకులు భూమి, అడవి, ఖనిజ సంపదలను దోచుకుంటున్నారని దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.

ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి మాడ్లాడుతూ ప్రపంచంలోని 189 దేశాలలోని ప్రజల జీవన ప్రమాణాలను పరిశీలిస్తే 120 కోట్ల మంది గల మన దేశం 150 దేశాల కంటే దిగువ స్థాయిలో ఉన్నదని, పది కోట్లమంది బాలకార్మికులు ఉన్నారని, ధరలు పెరిగిపోతున్నాయని, విద్య,వైద్యం అందరికీ అందడంలేదని, 42శాతం ప్రజలకు స్వంత భూమి లేదని, ఈ పరిస్తితులలో నూతన ప్రజాస్వామిక విప్లవం అవసరమని చెప్పారు.