Friday, January 25, 2013

సరిహద్దుల్లో చిచ్చు


కాశ్మీర్ పాకీస్తాన్ సరిహద్దుల్లో చిచ్చు

కాశ్మీర్ లో పాకిస్తాన్తో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద మళ్ళీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పదేళ్ళక్రితం కాల్పుల ఒప్పందం జరిగిన తర్వాత ఇంతగా పరిస్తితి ఏనాడూ దిగజారలేదు. గత 13 నెలల్లో 72 ఉద్రిక్త సంఘటనలు జరిగాయి. బంకరు ను నిర్మించినందున అది కాల్పులకు దారితీసింది.
కొంతమంది వాదిస్తున్నట్లు పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగిందని భావించడానికి ఆస్కారంలేదు. కొన్ని రోజుల క్రితమే పాకీస్తాన్ సైన్యం తన ప్రాధాన్యతలను పునర్నిర్వచించుకుంటున్న డాక్యుమెంట్లో ప్రధాన శత్రువుగా భారత్ ను తొలగించి, టెర్రరిష్టులను పేర్కొంది.భారత్ లోని ప్రతిపక్షాలు, పత్రికలు  కూడా పాకిస్తాన్ తో కఠినంగా వ్యవహరించమని కోరుతున్నాయి. భారత్ కు వాణిజ్యంలో అత్యంత అనుకూల దేశపు స్తాయి గుర్తింపును ఇచ్చేందుకు చర్చలకోసం పాక్ విదేశాంగశాఖామంత్రి భారతి రాబోతుండగా ఈ సమయంలో ఇలా జరగడం ఉభయుల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు తోడ్పడదు.
కనుక పాకిస్తాన్ పట్ల శతృత్వ వైఖరి విడనాడాలని, ఉభయులు చర్చించుకొని సమస్యలు పరిష్కరించకోవాలని , పొరుగు దేశంతో మైత్రిని సాధించాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యాలి.

http://www.janashaktionline.com  లో మరిన్ని వార్తలకై చూడండి.