Thursday, November 26, 2009

నేపాల్ పరిస్తితుల గురించి కామ్రెడ్. ప్రచండ వివరణ

నేపాల్ లో నూతన రాజ్యాంగ నిర్ణాయ సభ ద్వారా , నూతన రాజ్యాంగాన్ని ఏర్పరచడం 12 అంశాల ఒప్పందపు లక్ష్యం. ఆ సమయంలో రాచరికానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం ప్రధానాంశం. దీన్ని సాధించాము. రాజ్యాంగ నిర్ణాయ సభకు ఎన్నికలు జరిగాయి. సి.పి.యన్. (మావోయిస్టు) పెద్ద పార్టీగా వచ్చింది. మావోయిస్టుల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే శాంతి ప్రక్రియని ముందుకు తీసుకుపోతూ , రాజ్యాంగాన్ని రచించే క్రమం సాగుతుండగా , ఆధిపత్యం ప్రజలదా లేదా సైన్యానిదా అన్న చర్చ తలయెత్తింది. ప్రభుత్వం తరఫున నేను జారీ చేసిన ఆజ్ఞలన్నిటినీ సైన్యాధిపతి ధిక్కరించాడు. కనుక సైన్యాధిపతిని తొలగించే నిర్ణయం తీసుకున్నాను. నేపాలీ కాంగ్రెస్, యు.ఎం.ఎల్ సైన్యాన్ని సమర్ధించాయి. దానితో పరిస్తితి మరింత క్లిష్టమైంది. భారత్ ను ఇంగ్లీషు వాళ్ళు పాలిస్తున్నప్పటినుండి నేపాల్ రాజకీయాలు భారత్ కేంద్రంగా సాగుతున్నాయి. బ్రిటన్ కు నేపాల్కు యుద్దం జరిగి 1815 లో సుగొలి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత నేపాల్ అర్ధవలస దేశం అయ్యింది. రాణాల వంశపాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం సాగినప్పుడు , త్రిభువన్ భారత్ లో తలదాచుకున్నాడు. భారత్ సహాయంతో ఢిల్లీ ఒప్పందం పేరిట రాణాలపాలన అంతంచేసి త్రిభువన్ రాజవడంతో షాల వంశపాలన మొదలైంది. నేపాలీ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు బి.పి.కొయిరాలా కొంత స్వేచ్ఛ గురించి మాట్లాడగానే అతడు తొలగించబడ్డాడు. దీనిలో రాజును భారత్ ప్రోత్సహించింది. నిరంకుశ పంచాయితీ వ్యవస్థ నేపాల్ లో మనగలగటానికి భారతమద్దతే కారణం. సి.పి.యన్. పోరాటంతో నేపాల్ ఆర్ధిక, సాంఘీక, రాజకీయ పరిస్థితిలో మార్పు వచ్చింది. మా పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతోనే సమస్య ముందుకొచ్చింది. నేపాల్ భారత్ ల మధ్య ఉన్న ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రిక సంబంధాలను పునర్నిర్వచించుకోవాలి. దురదృష్టవశాత్తు ఇది జరగలేదు. భారత్ ఆదేశాలను నేపాల్ అమలు చేయాలన్న భావాలు ఢిల్లీలో ఉన్నాయి.
పార్టీ యు.ఎం.ఎల్. దారిలోనే నడుస్తుందా.. లేక పార్లమెంటరీపంధాలో కూరుకుపోతుందా.. అనే అనుమానాలు చాలా మంది కామ్రెడ్సుకు కలిగాయి. సోషలిజం ,కమ్యూనిజాలను ఆదర్శంగా నిలుపుకొని ప్రజావిప్లవపంధాలో సాగుతున్నామని నేను వారికి వివరించాను. నా రాజీనామా తర్వాత ఎలాంటి పెడధోరణి లేదన్న విశ్వాసం కామ్రెడ్స్ కు కలిగింది. విదేశీశక్తుల ఆజ్ఞలకు లొంగిపోకుండా అభివృద్ధి నిరోధక శక్తులపై పోరాటం సాగించడానికి నేను రాజీనామా చేశాను. నా రాజీనామా తర్వాత పార్టీ ఐక్యత పెరగడమేకాకుండా ప్రజల్లో కూడ పార్టీ ప్రతిష్ఠ పెరిగింది. మనల్ని మధ్యతరగతి ప్రజలుకూడ విశ్వసించడం మొదలుపెట్టారు. ప్రజావిముక్తి సైన్యం ప్రస్తుతం సైన్యశిబిరంలోనే ఉంది. ఆయుధాలు దానివద్దనే ఉన్నాయి. ఆయుధాగారపు తాళాలు దానివద్దనే ఉన్నాయి. కనుక అవి లొంగిపోలేదు. నిజానికి మేం బలపడ్డాం. మా స్థావర ప్రాంతాలు నిలిచేవున్నాయి. పార్టీ నిర్మాణం బలపడ్డది. వాస్తవానికి దేశమంతా మా స్థావర ప్రాంతమైంది. నేపాల్ ప్రజలు విజయం పొందుతారు.

Saturday, October 31, 2009

నోబెల్ యుద్ధ పురస్కారం

2009 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఏ రంగంలోనూ పరిగణింపదగిన విజయాలేవీ లేకపోగా – పురస్కారానికి ఎంపిక గడువు తేదీకి పదకొండు రోజులుండగా మాత్రమే అధ్యక్షుడైన వ్యక్తిని , అధ్యక్షుడు కాకముందు అతనెవరోకూడా మెజారిటీ అమెరికా ప్రజలకే తెలియని వ్యక్తిని, పాకీస్తాను గ్రామాలపై బాంబులు వేసి, పౌరుల హత్యను “ అనుబంధ నష్టం “ గా కొట్టివేసిన వ్యక్తిని, ఈ పురస్కారానికి ఎంపిక చేయటం నోబుల్ శాంతి పురస్కారాలు సంకుచిత రాజకీయాలతో కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది.
పురస్కారాన్ని ప్రకటిస్తూ నోబుల్ కమిటీ “ అణ్వాయుధాలు లేని స్వచ్చా ప్రపంచమన్న ఒబామా దార్శినికత ”ను ప్రశంసించింది. అయితే ఈ ప్రకటన ఎంత వైవిద్యపూరితమంటే, ఒబామా అధ్యక్షుడైన తరునాత నిరాయుధీకరణపై రష్యాతో జరిపిన చర్చలు నిరాయుధీకరణం జరిగిన తర్వాత 1500 ఆణ్వాయుధాలు కలిగి ఉంటానని అమెరికా మంకు పట్టు పట్టినందువల్ల విఫలం అయ్యాయి.
పురస్కారానికి ధన్యవాదాలు తెలుపుతూ శ్వేత సౌధంలోని గులాబి తోటలో విలేఖరుల సమావేశంలో ఒబామా " ఆశ్ఛర్య చకితుడిని మరింత వినమృడిని అయ్యానంటూ" అణ్వాయుధాలు లేని ప్రపంచమన్న తన లక్ష్యం తన జీవితకాలంలో నెరవేరదని అన్నాడు.

బాలగోపాల్ మృతికి సంతాపం

మానవ హక్కుల వేదిక నాయకుడు కె.బాలగోపాల్ హఠాన్మరణం దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రస్తుత దోపిడీ సమాజంలో మార్పునాశించి రాజకీయాలు చేపట్టిన బాలగోపాల్ హక్కుల రంగాన్ని కార్యరంగంగా ఎంచుకొని పనిచేశారు. ప్రధానంగా బూటకపు ఎన్కౌంటరు హత్యలు , రాజ్యహింసలకు వ్యతిరేకంగా పనిచేశారు. కె. బాలగోపాల్ మృతికి “ జనశక్తి ” సంతాపాన్ని తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది.

Sunday, August 16, 2009

హిల్లరీ క్లింటన్ పర్యటన : సాస్టాంగపడ్డ భారతప్రభుత్వం

అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్ ఐదురోజుల భారత పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన అనేక ఒప్పందాలు –వ్యూహాత్మక భాగస్వామ్యమంటే- భారతదేశం అమెరికా ప్రయోజనాలకు సహకరించడమే అన్నట్లుగా ఉంది.
రాగల 5 సంవత్సరాలలో 3000 కోట్ల డాలర్ల ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో 45 వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే 127 యుద్ధవిమానాలున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయవసినంత అవసరం ఇప్పుడేమొచ్చిందో మనకు అంతుబట్టని విషయం. మరో విషయం ఏమిటంటే మన దేశానికి ఏదైనా కారణంచేత ఇతర దేశంతో యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే తన సైనిక, ఆయుధ పాటవాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ మనకుండాలిగదా. ఆయుధాలు కొనేది అవసరమొచ్చినప్పుడు వాడటానికేగదా. అలా అవసరపడ్డప్పుడు తన వద్దనుండి కొనుగోలు చేసిన ఆయుధాలు వాడవచ్చునో లేదో నిర్ణయించే అధికారం అమెరికాకే ఉన్నదట. కొనుగోలు చేసిన ఆయుధాలు అమెరికా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారట. కనుక మనం ఎవరిమీద యుద్ధం చెయ్యాలో అమెరికా నిర్ణయిస్తుందన్నమాట. –అంతిమ వినియోగ పర్యవేక్షణ ఒప్పందం – అనే పేరు గల ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం కిమ్మన కుండా సంతకం పెట్టింది. ఇటువంటి చర్యలు భారత సార్వభౌమాధికారాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టుపెట్టినట్లుగా భావించాలి.
శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పరిశోధనలను పౌర అవసరాలకు వినియోగిస్తున్నారా లేక సైనిక అవసరాలకు వాడుతున్నారా అనేది తేల్చిచెప్పడం సాధ్యంకాదు. ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపే రాకెట్టూ , ఇతర దేశాలపై బాంబులు వేసే క్షిపణీ ఒక్కటే. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపగల రాకెట్టు భారత అంతరిక్షపరిశోధనా సంస్థ వద్ద ఉందంటే అర్ధం ఉపగ్రహం బదులు బాంబును పెట్టి ఏ దేశం పైన అయినా వేయగల ఖండాంతర క్షిపణి భారత సైన్యానికున్నట్లే. అంతరిక్ష వాణిజ్యేతర వినియోగం పై కూడా – అంతిమ వినియోగ పర్యవేక్షణ- వంటి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం అమెరికా అందజేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుతున్నారో పర్యవేక్షించి ఆంక్షలు పెట్టే అధికారం అమెరికాకు ఏర్పడింది. మన సైన్యం ఏపని చెయ్యాలన్నా అమెరికా అనుమతి కావాలి. దీనితో భారత అంతరిక్ష పరిశోధనలను అడ్డుకునేందుకు అమెరికా చేతిలో ఒక బెత్తాన్ని పెట్టి వొంగున్నట్లయింది. ఇది భారత దేశ శాస్త సాంకేతికాభివృద్ధిని సామ్రాజ్యవాద ఆధిపత్య బలిపీఠం పై నిలపడమౌతుంది.

Monday, August 10, 2009

కరవు కోరలు సాచుతున్నా పట్టించుకోని పాలకులు:

పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్,బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావ పరిస్తితులేర్పడ్డాయి. అల్పపీడనంతో పడ్డ చెదురుమదురు వర్షాలతో రాయలసీమ రైతులు వేరుశనగ వేసి బిందెలతో నీళ్ళు తెచ్చి పోసినా పంట ఎండిపోతుంది. గుండెపగిలి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
కరవు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. పరిస్థితి ఆందోళన కరంగా లేదని కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ లోక్సభలో ప్రకటించారు. మాయవతి మాత్రం ఉత్తరప్రదేశ్ లో 47జిల్లాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి, కేంద్రం నుండి 80వేల కోట్ల రూపాయల సహాయాన్ని కోరింది. ప్రతి ఏడాదీ వరదలూ, వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నా, తక్షణ సహాయచర్యలందించే బాధ్యతనుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు పూనుకుంటుంది. కనుక కరవుతో కుదేలైన రైతాంగాన్ని ప్రభుత్వం కొత్త ఆశలు కల్పించి కాంట్రాక్టు సాగు వైపు , బడా బూర్జువాల పరిశ్రమలకు ముడిసరుకుగా వాణిజ్య పంటలవైపుకు మళ్ళించబూనుకునే ప్రయత్నంఉందన్న అనుమానం కలుగుతుంది.

Saturday, June 27, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 12

సహజ ఎంపిక ఫలితంగా ఒకరకమయిన ‘ సహజ సాంకేతికత ’ ద్వారా వివిధ జీవుల అవయవాలు అభివృద్ధి పొందినట్లు డార్విన్ పేర్కొన్నట్టు మాదిరిగానే మానవుల యొక్క పనిముట్లు, అవయవాలూ, సామాజిక పరిమాణం యొక్క ఉత్పత్తులు గా అభివృద్ధి చెందినవే. మానవుని యొక్క పనిముట్ల అభివృద్ది అనేది , అదే విధంగా ‘ సమానమైన ధ్యాస ’ పెట్టాల్సిన మానవ సమాజ పరిణామం పట్ల వహించాల్సిన వైఖరిని మనకు ఇవ్వట్లేదూ? అటువంటి చరిత్ర (మానవ పరిణామ)ను కూర్చడం అన్నది తేలికైన పనిగా ఉండదూ? ఎందుకంటే వైకో చెబుతున్నట్లు మానవ చరిత్ర ప్రకృతి చరిత్ర నుండి విభేదిస్తుంది. మానవ చరిత్రను మనం తయారు చేశాం. కానీ, ప్రకృతి చరిత్రను మనం తయారు చేయలేదు కనుక! అని మార్క్స్ చరిత్ర పట్ల వహించాల్సిన పరిణామవాద వైఖరిని సూచించారు.

1859 లో డార్విన్ తన ‘ జీవుల పుట్టుక ’ ప్రచురించడం ద్వారా తనయొక్క ‘ సహజ ఎంపిక ద్వారా పరిణామం ’ అన్న సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టే సమయంలోనే ‘ మానవ తెగలను గురించిన శాస్త్రపు అధ్యయన విప్లవకాలం ’ ప్రారంభమయి, ప్రపంచాన్ని గురించిన బైబులు పద్ధతి దృక్కోణంపై దాడి జరిపింది. అతి పురాతన కాలం నుండే భూమిపై మానవులు ఉనికిలో ఉన్నారు అన్న శాస్త్రీయ విజ్ఞాన ఆధారాలు 1856 లో కనుగొనబడ్డాయి. బైబులు భావిస్తున్నట్లు మానవులు కొద్ది వేల సంవత్సరాలుగానే ఉనికిలో ఉన్నారు అన్న అభిప్రాయాన్నిఈ ఆధారాలు నిరాకరించి ఖండించాయి.

ఈలోగా మోర్గాన్ తన మానవ శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన ‘ పురాతన సమాజం ’ అన్న రచనను ప్రవేశవెట్టాడు. మార్క్స్ ఈ రచనపై ఆధారపడ్డ తన వైఖరి ద్వారా మానవులయొక్క పూర్తి ఉత్పత్తి , కుటుంబ సంబంధాల అభివృద్ధిని గురించి అవగాహనను రూపొందించుకునే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా మతం యొక్క నిర్ణయాధికారపు పరిధి నుండి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్ణయాధికార పరిధి యొక్క విస్తరణ జరిగింది.

అందువలన మార్క్స్ తన యవ్వన కాలంలో పెట్టుబడిని గురించిన విమర్శనాయుత పరిశీలనను అభివృద్ధి చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని, తనయొక్క మతంపై జరిపిన విమర్శనాత్మక పరిశీలన నుండి ఉద్భవించిన ప్రపంచాన్ని గురించిన మరింత మౌలికమైన భౌతికవాద/ మానవతావాద దృష్టిలో భాగంగా చూడాల్సి ఉంది.

ఇక మరణాన్ని గురించి మార్క్స్ ఈ విధంగా ఎపికారస్ చెప్పిన మాటలను పునరుల్లేఖించినట్లు ఏంగెల్స్ గుర్తుకు తెచ్చుకొని వివరించాడు. ‘ చచిపోయినవాడికి మరణం అనేది ఒక దురదృష్టం కాదు ’ , కానీ బ్రతికున్నవాడికే అది దురదృష్టం. ‘ ప్రపంచం భ్రమల నుండి ప్రత్యేకించి, మతం కల్పించిన దేవుళ్ళ పట్ల భయం నుండి వదిలించుకు బైటపడాలి, ఎందుకంటే ప్రపంచం నా మిత్రుడే కనుక! ’ అంటూ మార్క్స్ బలంగా వాదించాడు. మానవ స్వభావం యొక్క అభివృధ్ధి కొత్త అవసరాలు ఏర్పడటం మొదలైన అన్ని విషయాలతో కూడిన మానవ చరిత్ర అంతా, తమకు తాముగానే దేవుళ్ళ సహాయం లేకుడానే స్వయం మధ్యవర్తిత్వం నెరిపిన ప్రకృతి యొక్క జీవులైన మానవుల ద్వారానే తయారు చేయబడింది, అన్న విషయాన్నిమార్క్స్ ‘ దేవుళ్ళ సహాయం లేకుండానే వస్తువులు(జీవులు) ఉనికిలోకి వచ్చాయి ’ అని ల్యూక్రెటిస్ రాసిన దానిని అదనంగా చేర్చి చెప్పాడు.

( జాన్ బెల్లామీ పాస్టర్, బ్రెట్ క్లార్క, రిచర్డ యార్క్ లు సంయుక్తంగా రాసిన ‘ తెలివైన సృష్టిపై విమర్శనాత్మక పరిశీలన ’ అన్న గ్రంధంలోని అయిదవ అధ్యాయం యొక్క సంగ్రహ సారాంశం ఇది.)

Saturday, June 20, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 11

లక్ష్యాత్మకవాదం యొక్క మరణం:
ప్రకృతి అంతా లక్ష్యాత్మకమైనది అన్నది లక్ష్యాత్మక వాదం యొక్క సారాంశం. అంతిమ లక్ష్యమే యదార్ధాన్ని (ప్రకృతి యొక్క) నిర్దేశిస్తుంది అని ఈ వాదం భావిస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రాసికి ప్రకృతి యొక్క భౌతిక అవగాహన, చారిత్రిక భౌతికవాద అవగాహనలు వదిలివేయరాని, అత్యావస్యకమైన పునాదులు అన్నది మార్క్స్ యొక్క నిశ్ఛితాభిప్రాయం. మానవ చరిత్ర, ప్రకృతి చరిత్ర అంతిమంగా ఒకే చారిత్రిక చట్టం క్రిందికి వస్తాయి. అందువలనే ఆయన ఒక దేవుని యొక్క పధకం ప్రకారం జరిగిన సృష్టి అన్న అన్ని రకాల భావనలకూ వ్యతిరేకంగా ఆయన పరిణామవాద దృక్ఫధాన్ని నిలకడగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఒకరకమైన ఆకస్మక, యాదృచ్చిక ఉత్పాదనానికి అనుగుణంగా ఈ ప్రపంచంలో ‘ ప్రాణం ’ ఆవిర్భవించిందని ఆయన దృఢంగా వాదించాడు. ఆయన ఏంగెల్స్ తో కలిసి జీవసంబంధమైన ఉనికిని గురించి లక్ష్యాత్మకవాద అంశాల పరిధిలో అర్ధం చేసుకోలేము అనీ ‘ జంతువులకూ, మొక్కలకూ మధ్యగల తీవ్రమైన పోటీ ’ అన్న అంశంలో జీవ రూపాల ఉనికి ముడిపడి ఉందనీ అటువంటి పోటీలోనే తెగలకు (జీవులకు) ప్రకృతికీ చెందిన సహజ పరిస్థితులకూ గల సంబంధం యొక్క భౌతిక కారణం ఉందనీ ఆయన వాదించాడు. చారిత్రిక భూగర్భ శాస్త్రాల నుండి పుట్టుకొచ్చిన ‘లోతైన కాలం’ అన్న అవగాహనను ఆయన ముందునుండీ అనుసరించాడు.
మార్క్స్ డార్విన్ యొక్క పరిణామవాద సిద్ధాంతాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. డార్విన్ యొక్క ’ జీవుల పుట్టుక ‘ గ్రంధాన్ని చదివిన అనంతరం మార్క్స్ ఫెర్డినాండ్ లూసే కు ఉత్తరం రాస్తూ ‘ మొట్టమొదటి సారి ఈ గ్రంధంలో ప్రకృతి శాస్త్రంలో లక్ష్యాత్మక వాదానికి చావుదెబ్బ కొట్టడం జరిగింది. దానియొక్క హేతుబద్ధమైన అర్ధాన్ని అనుభవవాదం ద్వారా వివరించడం జరిగింది ’ అని పెర్కొన్నాడు. అయితే డార్విన్ మాల్తూస్ ను స్పూర్తిగా తీసుకొని తన ‘ సహజ ఎంపిక ’ సిద్ధాంతాన్ని అభివృద్ధిచేయడం వలన ‘ క్రైస్తవ మత నైతికత ’ ప్రకృతి మత ధర్మశాస్త్రాలను, వర్గాలూ-ఆస్తిని విభజించే బూర్జువా సమర్ధనలనూ సమాదరించిన మాల్తూస్ సిద్ధాంతానికి, అనుకోకుండా డార్విన్ సామాజిక రంగంలో అర్హత కల్పించాడనీ, మార్క్స్ ఆయన్ని విమర్శించాడు. అందువల్లనే మార్క్స్ , ఏంగెల్స్ లు మానవజాతి స్వేశ్ఛను మరింత పెంపొందించడం కోసం భౌతికవాద/ మానవతావాద శాస్త్ర విజ్ఞానానికి కట్టుబడి వుంటూ అన్ని సందర్భాలలోనూ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని మాల్తూస్ సిద్ధాంతం లేదా సామాజిక డార్వినిజం అన్న సిద్ధాంతాలనుండి వేరుచేసి విడిగా చేయాలని కోరుకున్నారు. వర్గసంబంధాలను సమర్ధించేందుకు ఉద్దేశింపబడిన మాల్తూస్ యొక్క నైరూప్య జనాభా సిద్ధాంతం యొక్క స్థానంలో , మానవ జనాభా యొక్క అభివృద్ధిని, సమాజాల అభివృద్ధిని గురించి వాటికి సంబంధించిన అన్ని కోణాలను గురించి ఒక చారిత్రక, భౌతికవాద, శాస్త్రీయ అవగాహనను అభివృద్ది చేయడం కోసం మార్క్స్ ఎక్కువ మేరకు మానవతా జాతి ఉద్భవం , వారి నడవడిక సాంప్రదాయాల అధ్యయనం జరిపే నూతన శాస్త్రమయిన మానవ శాస్త్రం వైపుకు ప్రధానంగా తన దృష్టిని మళ్ళించాడు.

Saturday, June 13, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 10

జనాభా సిద్ధాంతాన్ని రాసిన మాల్థూస్, తనకు ముందున్న టౌన్ సెండ్ మాదిరిగానే ‘ పురోహిత మత మౌఢ్యపు’ నేరాన్ని చేసిన నేరస్తుడు. మాల్థూస్ యొక్క సిద్ధాంతాలు శాస్త్రీయమైనవిగా చూపెట్టబడినా ‘ పేదలకు సంబంధించిన చట్టాలు’ తొలగింపబడటాన్ని సమర్ధించడానికి మాల్థూస్ దేవుడ్ని అంతిమ కారణంగానూ, దైవేచ్ఛ మతపర నైతికతను దైవ సాక్ష్యాలుగానూ ముందుకు తీసుకు వచ్చాడు. అందువల్లనే ప్రగతిశీల రాజకీయవాది అయిన విలియం కొబెట్ మాల్థూస్ ను గురించి మార్క్స్ చెప్పిన ఉద్దేశ్యంలోనే ఇలాగన్నాడు:
‘ నేను నా జీవితకాలంలో అనేకమందిపట్ల నా అయిష్టతనూ, యావగింపునూ ప్రదర్శించాను. కానీ వారిలో నీయంతటి రోసిపోయిన వాడెవ్వడూ లేడు....... నీ గురించి ఎన్ని పదబంధాలు చెప్పినా , సరైన వర్ణనను ఇవ్వలేవు. అందువలన నీ గుణగణాలను ఒక్క పదమే సక్రమంగా వర్ణించగలుగుతుంది. అందుకే నిన్ను ‘ పురోహితుడు ’ అని పిలుస్తాను. ఈ పదానికి ఉన్న అనేక అర్ధాలతోపాటు ‘ పట్టణంలో వ్యాపారం చేసేవాళ్ళ చేతిలో పనిముట్టు’ అనే అర్ధం కూడా ఉంది ’ అంటూ మాట్లాడి మాల్థూస్ పట్ల కార్మికవర్గానికి గల ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు.
మాల్థూసియన్ సిద్ధాంతం మతతత్వ పిడివాదం యొక్క ఆత్మకూ – ప్రకృతికీ మధ్య గల వైరుధ్యం , తత్ఫలితంగా అవినీతి పాలైన ఆత్మ ప్రకృతి లకు చెందిన ఆర్ధికవాద వ్యక్తీకరణ – అని ఏంగెల్స్ 1844లో రాశాడు.’ క్రైస్తవ మతం యొక్క ఆశయంగా ’ ఆకలి ’ స్తానంలో దానికి అనుబంధంగా ‘ భయాన్ని’ ఉంచడం ద్వారా బూర్జువా పరిశ్రమకు ఆశయంగా ‘ ఆకలి ’ అనుబంధంగా ఉంచబడింది. ‘ఆరకంగా ఇది దేముడి యొక్క పథకానికీ , సహజ ధర్మానికి ఋజువుగా చెప్పబడింది. ‘ ఆకలి శాంతియుతమైన ’ మౌనంగా ఉండే ఎడతెగని వత్తిడి మాత్రమేకాదు, అది పరిశ్రమకూ , కార్మికశక్తికీ చాలా మేరకు చలనశక్తిగా ఉంది. అది అత్యంత శక్తివంతమైన సంఘర్షణకు దారితీస్తుంది.’ అని జోసఫ్ టేన్ సెండ్ 1786లో వెల్లడించిన అంశాలను కార్ల్ మార్క్స్ గుర్తు పెట్టుకున్నాడు.

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 9

ముందుగా మార్క్స్ మతంపై చేసిన విమర్శనాయుత పరిశీలన , ఊహాపూర్వక తత్వశాస్త్రం, తర్వాతి కాలంలో ఆయన బూర్జువా సమాజపు సిద్ధాంతంపై చేసిన విమర్శనాత్మక పరిశీలనకు ప్రాతిపదిక అయింది. ‘ మేధస్సును మత దర్శీకరణ చేయడం ’ అన్న రచనలో మార్క్స్ తాను బలీయంగా వ్యక్తం చేసిన భావనలు ,ప్రబలంగా ఉన్న భౌతిక సంబంధాలకు సంబంధించిన , ప్రబలంగావున్న భౌతికసంబంధాలనుండి గ్రహించిన భావనల ఆదర్శ వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు అని తెలియజేశాడు.
జర్మనీ దేశ సందర్భంగా ప్రస్తావిస్తూ ప్రొటెస్టెంట్ సంస్కరణల్లో ప్రత్యేకించి లూథరినిజం అన్నది ఎదుగుతూ ఉన్న బూర్జువా సమాజానికి తొడిగిన సరికొత్త మతపరమైన దుస్తులుగా మార్క్స్ తరుచూ పేర్కొనేవాడు.ఆ రకంగా ఆయన వ్యంగ్యంగా మార్టీన్ లూథర్ యొక్క వాదనల్లో పేర్కొన్న దోపిడి ప్రపంచపు ఉనికిని, దేముడియొక్క పథకరచనకు సాక్ష్యంగా చెప్పేవాడు. ఈ రకంగా మార్క్స్ అటు మతం పైన ఇటు పెట్టుబడి పైనా అనంతంగా విమర్శనాత్మక పరిశీలన జరిపాడు.
మార్క్స్ సూటిగానే, నేరుగా మతంతో తలపడ్డాడు. ఎందుకంటే ఆది (మతం) నైతికత, శాస్త్ర విజ్ఞానశాస్త్రాల రాజ్యం లోకి చొరబడింది. కనుక నైతిక అనేదాన్ని పునాదివాదపు లేదా సాపేక్షతావాద అంశాల పరిధుల్లో నిర్ణయించ వీలులేదు. నైతికతను మానవ సమూహాల భౌతిక అవసరాలతో పుట్టుకొచ్చిన నైతిక పరిస్థితులపై ఆధారపడ్డ విప్లవ చారిత్రాత్మక వాదపు అంశాలపై ఆధారపడి నిర్ణయించాలి. అందువల్లనే మార్క్స్ ‘ మార్మిక వైఖరి, దైవకృత లక్ష్యం, దైవం ’ లాంటి భావాలపై దాడి చేశాడు. మతం యొక్క అంతిమ కారణం నుండి పుట్టుకొచ్చే అన్ని పునాది వాదపు నైతికతనూ తిరస్కరించాడు. ఆయన మానవులే ‘ తమయొక్క స్వంత నాటకం యొక్క రచయితలూ, నటులూ ’ అని నొక్కి చెప్పాడు.
సంకుచితమైన మతపరమైన నైతికతను , రాజకీయ అర్ధశాస్త్రపు అభివృద్ధిపై మతపర నైతికతయొక్క ప్రభావాన్ని తెగనాడుతూ మార్క్స్ తన పెట్టుబడి గ్రంథంలో జనాభాను గురించిన సిద్ధంత కర్తల్లో ఎక్కువమంది ప్రొటంస్టెంట్ పురోహితులే. .... (రాజకీయ ఆర్ధిక శాస్త్రంలోకి ) జనాభా సిద్ధాంతం ప్రవేశించటంతోటే , ప్రొటెస్టెంట్ పురోహితుల సమయం మొదలయిందని పేర్కొన్నాడు. ఇటువంటి ఆలోచనాపరులు శాస్త్రవిజ్ఞానంనుండి వైదొలిగి , పాలకవర్గ సామాజిక వ్యవస్థను సమర్ధించడం కోసం, ప్రాకృతిక మత ధర్మశాస్త్రపు, మత నైతికత్వపు వాదనలను శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ , రాజకీయ ఆర్ధికశాస్త్ర రంగంలోనూ అనుమతిస్తారనీ, మార్క్స్ వీరి ప్రవేశానికి (రాజకీయ ఆర్ధిక శాస్త్రరంగం లో) తన ప్రధాన అభ్యంతరాన్ని తెలియజేశాడు.

Thursday, June 11, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 8

అందువలన మతం పట్ల మార్క్స్ యొక్క విమర్శనాత్మక పరిశీలన దేముడియొక్క ప్రకృతి అతీత ఉనికిని గురించికానీ అటువంటి ఉనికి లేదని చెప్పడం గురించి కాని కానేకాదు. కానీ ఈ భౌతిక ప్రపంచం గురించీ, మానవులున్న ఈ ప్రపంచం గురించి , హేతువూ- శాస్త్రవిజ్ఞానం గురించి రూఢిగా చెప్పడం గురించి ఆయన విమర్శనాత్మక పరిశీలన జరిగింది. ఇవన్నీ మానవుడు మతాన్ని ఒక మధ్యవర్తి ద్వారా వక్రమార్గాన గుర్తించడాన్ని వ్యతిరేకించి మతాన్ని స్థానభ్రంశం చేయడానికి అవసరమవుతాయి. అందువల్లనే థామస్ డీన్ మార్క్స్ యొక్క విమర్శనాత్మక పరిశీలన ( మతాన్ని గురించి ) ను గురించి సరిగ్గానే ఈ విధంగా రాశాడు. మార్క్స్ నాస్తిక వాదాన్ని కేవలం మతాన్ని ఒక సిద్ధాంతంగా మాత్రమే పరిగణించిందని భావించాడు. అందువలన నాస్తికవాదం మతవిధమైన ఆలోచనా విధానానికి సమూలమైన విప్లవాత్మక ఛేదనం చేయటానికి దారితీయదు. నాస్తికవాదం ఎక్కువగా ఆస్తికవాదానికి అంతిమ దశగా , భగవంతుని యొక్క వ్యతిరేక గుర్తింపు గా కనిపిస్తుంది తప్ప మానవుని యొక్క ఈ లౌకిక ప్రపంచపు తత్వశాస్త్రపు అనుకూల సిద్ధాంత పునాదిగా కనిపించదు. అది దేముణ్ణి స్తానభ్రష్టుణ్ణిగా చేయాలనే వాంఛను అనివార్యంగా పెంచుతుంది. ఈ రకంగా నాస్తికవాదం ఆమేరకు మానవుని ఉన్నత స్థాయిలో లేదా దైవీకరణ చేసిన స్థాయిలో ఉంచే అవగాహనను నిరాకరిస్తుంది. ..... ఇది కేవలం , మానవత్వ వాదాన్ని నాస్తిక వాదం గుండా అతీంద్రియ వాదపు మధ్యవర్తిత్వం నెరిపే , అతీంద్రియ భావవాదం అని భావించరాదు.
సాధ్యమయ్యే అవకాశం ఏర్పడడం కోసం ఒక అవసరమైన మార్క్స్ యొక్క నాస్తికవాదం ఒక - సానుకూల మానవతావాదం తననుండి తానే పుట్టుకువచ్చే మానవతావాదం సాధ్యం అవటానికి ఏర్పడే అవకాశానికి ఇది ఒక అవసరమైన , ముందుగా అనుకొన్నఆలోచన - అందువలన మార్క్స్ యొక్క నాస్తికవాదం ఆయన యొక్క లౌకిక అనుభవవాదం అన్నవి భగవంతుడి ఉనికిని కాదని నిరూపించే ఊహలు కానీ, సైద్ధాంతిక వాదనలు కానీ కావు. అటువంటివి అయితే అవి మత ధర్మశాస్త్ర గుణాలుగల మతధర్మశాస్త్రమే అయిన దానియొక్క సైద్ధాంతిక పునాది అవుతాయి. కానీ మార్క్స్ యొక్క నాస్తికవాదం తాను తక్షణంగా ఎటువంటి మధ్యవర్తి లేకుండా తన స్వంతకాళ్ళపైన నిలబడగలిగే విధంగా స్వతంత్రంగా రూపొందిచబడిన మానవతావాదం.
మార్క్స్ యొక్క గతితార్కికవైఖరి ‘ నిజమైన ఆనందం ’ అసాధ్యం అవటం వలన ఏర్పడిన అవసరానికనుగుణంగా కల్పించబడిన భ్రమాపూర్వక ఆనందానికి ఉత్పత్తి స్తానంగా మతాన్ని భావించింది. అందువలన ఆయన మతాన్ని – హృదయంలేని ప్రపంచం యొక్క హృదయంగా – పేర్కొనగలగడమే కాక మనం ‘ క్రైస్తవ మతాన్ని చాలావరకు క్షమించ వచ్చు. ఎందుకంటే అది మనకు శిశువుని పూజించడాన్ని నేర్పింది’ అని చెప్పగలిగాడు. అందువలన మతం యొక్క విమర్శనాత్మక పరిశీలన అనేది నైరూప్య నాస్తిక వాదం. ధ్యాన , భౌతిక వాదాలను మించి విప్లవ ఆచరణలో వేళ్ళూనుకుని ఉన్న నేలపై నాస్తికవాదం తలెత్తగలితే అది ఆమేరకు అర్ధవంతమైనదవుతుందని మార్క్స్ రాశాడు.

Friday, May 8, 2009

అభ్యర్ధులు


మోడెం.మల్లేష్
నర్సంపేట అసెంబ్లీ అభ్యర్ధి







జి.నాగభూషణం
పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్ధి



కేండ్రుక.అర్జున
లక్ష్మీపూర్ అసెంబ్లీ అభ్యర్ధి



కుండ్ల.పెదగంగరాజు
రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్ధి




కండ్రక.వెంకటస్వామి
కురుపాం అసెంబ్లీ అభ్యర్ధి




ఊయక. ముత్యాలు
సాలూరు అసెంబ్లీ అభ్యర్ధి










కామ్రెడ్. ఇల్లా. రామిరెడ్డి
అరకు పార్లమెంటు అభ్యర్ధి
















పశ్చిమ బెంగాల్ - పార్లమెంటు సభ్యులు

1.బాలూర్ ఘాట్ - షాన్ సరేన్

2.రాయ్‌గంజ్ - ఉపెన్ దాస్

3.డార్జలింగ్ - రామ్ గణేష్ బరాక్

Saturday, May 2, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 7

భూమిని గురించిన విమర్శనాత్మక పరిశీలన:
ప్రపంచాన్ని మానవీయ , పాదార్ధిక, శాస్త్రీయ అవసరాలకు అనుగుణంగా అన్ని సమయాల్లోనూ అవగాహన చేసుకోవడానికి వీలుగా మార్క్స్ చేసిన మతంపై చేసిన విమర్శనాత్మక పరిశీలన అమర్చ ( రూపొందించ ) బడింది. రెండు గతితార్కిక ఉద్యమాల వలన మతపరమైన పరాయీకరణపై చేసిన విమర్శనాత్మక పరిశీలన , లౌకిక ప్రపంచం యొక్క పరాయీకరణపై విమర్శనాత్మక పరిశీలన చేయడానికి దారితీసింది. 1. ఎపిక్యురస్ , ఫ్యూర్‌బాలు మతంపై జరిపిన విమర్శనాత్మక పరశీలనల నుండి , మానవ ప్రపంచాన్ని మతం పరాయీకరించిందని , అందువలన మానవ స్వేచ్ఛకు విలోమత్వం సంభవించిందనీ – ఈ విమర్శనాత్మక పరిశీలన మత ధర్మశాస్త్రం నుండి భావవాద తత్వశాస్త్రం వరకూ ( హెగెల్ జరిపినట్లు) విస్తరించబడిందనే విషయం నిశ్చయమైంది. 2. అదేవిథంగా ఈ విమర్శనాత్మక పరిశీలన స్వచ్ఛమైన తీవ్ర ఆలోచన జరిపే భౌతికవాద/ మానవీయ విమర్శనాత్మక పరిశీలనలకు విస్తరించిందనీ ఇంతవరకు ఆ పరిశీలనలు భూమిని గురించి ముందుగా అనుకున్న విధంగా ( అంటే భౌతిక , చారిత్రక వాస్తవాల గురించి ) జరిగిన విమర్శనాత్మక పరిశీలనలు కావనే విషయం నిశ్చయమైంది.
అందువలన నాస్తిక వాదం ఫ్యూర్‌బా యొక్కతీవ్ర ఆలోచనా రాజ్యం, ఆకాశంలోనే మిగిలిపోతే అది సరిపోనిదిగానూ, నిజమైన అర్ధాన్ని ఇవ్వనిదైన అర్ధ విహీన అంశంగానూ, కేవలం మానవీయ తత్వశాస్త్రాన్ని అభివృద్ధి పరచడానికి ఒక మొదటి మెట్టుగానూ ఉంటుంది. ఒక ఆదర్శంగా నాస్తిక వాదం చాలా మేరకు నైరూప్యమైనది అని మార్క్స్ నొక్కి చెప్పాడు. అది దేముడ్ని లేడని ఖండించడం ద్వారా మానవుని యొక్క ఉనికిని నిశ్ఛయముగా నొక్కి చెబుతుంది. ఆ రకంగా భావవాదనాస్తికవాదం కేవలం సైద్ధాంతిక మానవతావాదాన్ని కూడి ఉందని కార్ల్ మార్క్స్ వ్రాశాడు.
ఒక భౌతికవాదిగా మార్క్స్ దేముడి యొక్క మతం యొక్క నైరూప్యత పైన తన ఆలోచనను పెట్టడానికి ఎంచుకోలేదు. అదే సమయంలో ఆయన దేముడి యొక్క అతీతమైన ఉనికిని లేదని ఋజువు చెయ్యలేదు. అలా చేయడంవలన అది వాస్తవ , అనుభవపూర్వకమైన ప్రపంచానికి అతీతంగా ఉంటుంది. దానికి సంజాయిషీ ఇవ్వడం సాధ్యం కాదు. హేతువు ద్వారా, పరిశీలన ద్వారా, శాస్త్రీయ విచారణ ద్వారా ఆవిషయానికి జవాబు తేల్చటం సాధ్యం కాదు. ఇందుకు బదులుగా అన్ని పరిమితులలోనూ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి వీలైన ఒక చారిత్రక భౌతికవాద వైఖరికి తన శాస్త్రీయ నిబధ్ధత ద్వారా ఒక ఆచరణాత్మక నాస్తికత్వాన్ని ఆయన రూపొందించాడు. ఆచరణాత్మకంగా భగవంతుణ్ణి లేడని ఖండించడం , మానవత్వ శాస్త్ర విజ్ఞానాలను ధృవీకరించి చెప్పడమన్నవి , విప్లవ కరమైన సామాజిక మార్పు కోసం , మానవాభివృధ్ధి కొనసాగింపు కోసం, మానవ శక్తి సామర్ధ్యాల పెరుగుదల, సామర్ధ్యాలను వృధ్ధి చేయడం కోసం మరియు స్వేచ్ఛను అభివృద్ధి చెయ్యడం కోసం ఒక క్రియాశీలకమైన ఉద్యమాన్ని డిమాండ్ చేసాయి.

Tuesday, April 7, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 6

హెగెల్ యొక్క సక్రమ ధర్మతత్వం పై మార్క్స్ రాసిన విమర్శనాయుత పరిశీలన 1844 లో ప్యారిస్ లో ప్రచురింపబడింది. ‘ మతంపై మార్క్సిస్టు విమర్శనాయుత పరిశీలనకు మగ్నాకార్టా ( హక్కుల పత్రం ) ’ గా ఈ రచనను పిలుస్తారు. ఇందులో మార్క్స్ ‘ మనిషి మతాన్ని తయారు చేస్తాడు. మతం మానవుడ్ని తయారు చేయదు. మతం అంటే తన యొక్క తనం నుండి తాను ఇంకా విజయం పొందని మనిషి లేదా అప్పటికే తనయొక్క తనాన్ని తాను మరోసారి పోగొట్టుకున్న మనిషి యొక్క ఆత్మ చైతన్యం మరియు ఆత్మ గౌరవం. అయితే మనిషి ప్రపంచానికి బయట గొంతు కూర్చొని ఉన్న నైరూప్యమైన జీవి కాదు. మనిషి, మానవుని యొక్క , రాజ్యం యొక్క సమాజం యొక్క ప్రపంచానికి చెందిన వాడు. ఈ రాజ్యమూ , సమాజమూ మతాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మతం ప్రపంచము యొక్క విలోమ చైతన్యం. ఎందుకంటే అవి ఒక విలోమ ప్రపంచం....... మతం మానవ సారాంశం యొక్క వింతైన ( అసహజ ) వాస్తవికత. ఎందుకంటే మానవ సారాంశం ఏవిధమైన నిజ వాస్తవికతనూ సముపార్జించలేదు గనుక. అందువలన మతానికి వ్యతిరేకంగా పోరాటం అంటే పరోక్షంగా మత సుగంధం గల ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి వ్యతిరేక పోరాటం.
మతపరమైన వ్యధ అంటే వాస్తవమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ. అదే సమయంలో నిజమైన వ్యధకు వ్యతిరేకంగా నిరసనను తెలియజేయడం. మతం అణచబడ్డ జీవియొక్క నిట్టూర్పు; హృదయం లేని ప్రపంచం యొక్క హృదయం. ఆత్మ లేని పరిస్తితుల యొక్క ఆత్మ. ఇది ప్రజల యొక్క నల్లమందు ‘ అంటూ ప్రకటించాడు.
ఆ రకంగా ఇక్కడ మతాన్ని ‘ నిజమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ ’ అంటూ ‘ అణచిపెట్టబడిన వారికి ఒక అవసరమైన దు:ఖోపశమనం ’ అంటూ మార్క్స్ మతం పట్ల ఒక నిజమైన సానుభూతిని చూపించాడు. అణచిపెట్టబడిన వారిని , సంపన్నుల మాదిరిగా నల్లమందు లాంటి దు:ఖోపశమనాలు అందుబాటులో ఉండవు. విలోమంగా ఉన్న ప్రపంచానికి విలోమంగా ఉన్న ప్రపంచానికి వింతైన ( అద్భుతావహమైన ) వ్యక్తీకరణగా ఉన్న మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడాన్ని అణచిపెట్టబడ్డవారు ఇంకా నేర్చుకోలేదు. స్కూలు పరీక్ష కోసం రాసిన ‘ క్రీస్తుతో విశ్వాసం గలవారి సంలీనం ’ అన్న తన వ్యాసంలో తాను తీసుకున్న వైఖరికి పూర్తిగా వ్యతిరేకమైన వైఖరిని తీసుకున్న కార్ల్ మార్క్స్ ‘ భ్రమాపూర్వకమైన ఆనందాన్ని ప్రజలకు ఇచ్చి మతాన్ని రద్దు చెయ్యాలన్నది , ప్రజల యొక్క వాస్తవమైన ( పాదార్ధిక ) ఆనందం కోసం చేసే డిమాండ్ ’ అంటూ వాదించాడు.
ఈ రకంగా వాదించిన కార్ల్‌ మార్క్స్ ‘ క్రైస్తవ మతానికి హేతువుతో సఖ్యపడడం కుదరదు. ఎందుకంటే ‘ లౌకికతత్వం ’, ’ ఆధ్యాత్మికతలు ’ ఒకదానిని మరొకటి పూర్తిగా వ్యతిరేకించుకుంటాయి ’ అంటూ ఆయన తన మత ధర్మశాస్త్రపు , సృష్టి పథకం యొక్క వాదాలను నిశితంగా విమర్శించాడు.
‘ విలోమ ప్రపంచానికి ’ సాధారణ సిద్ధాంతం గానూ, విజ్ఞాన సర్వస్వ సారాంశం గానూ ఉన్న మతాన్ని విమర్శనాయుతంగా పరిశీలించటమన్నది, ఆ విలోమ ప్రపంచాన్ని విస్తృతంగా విమర్శనాయుత పరిశీలన జరపడానికి మొదటి మెట్టు అవుతుందని మార్క్స్ భావించాడు.
‘ స్వర్గం పై చేసిన విమర్శ , భూమియొక్క విమర్శ పైకి మళ్ళుతుంది. మత ధర్మశాస్త్రం పై విమర్శ రాజకీయ శాస్త్ర విమర్శకు మళ్ళుతుంది. అందువలన మతంపై విమర్శనాత్మక పరిశీలనే తత్వశాస్త్రాన్ని, విజ్ఞానశాస్త్రాన్నిసాధ్యం చేసింది ’ అని మార్క్స్ తెలియజేశాడు.
ఈరకంగా ఆయన స్వర్గంపై చేసిన విమర్శ , భూమిపై విమర్శకు మళ్ళింది.

Monday, April 6, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 5

అది ఆకస్మికతే. దాన్నే తప్పనిసరిగా అంగీకరించాలి- జనబాహుళ్యం నమ్ముతున్నట్లు దేవుడుకాదు...... పేదరికంలో నివసించడం అన్నది దురదృష్టం. కానీ పేదరికంలో జీవించడం అన్నది ఒక అవసరం కాదు. అన్ని వైపులా స్వాతంత్యానికి తేలిక అయిన దగ్గరి మార్గాలు తెరిచివున్నాయి. ....పేదరికాన్నే ( అవసరాన్నే) లొంగదీసుకోవడం అన్నది అనుమతించబడింది ‘ అన్న ఎపిక్యురస్ చెప్పిన అభిప్రాయాలు కార్ల్ మార్క్స్‌ ను ఆ అభిప్రాయాల వైపు మరింత దగ్గరగా ఆకర్షించాయి. ‘ గ్రీకు సారస్వత తత్వశాస్త్రం యొక్క ఆఖరి రూపాలు – ప్రత్యేకించి ఎపికరియన్ తత్వరూపాలు – నాస్తిక, భౌతికవాదానికి దారితీస్తే, గ్రీకు మోటు తత్వశాస్త్రం ఒకే ఒక దేముడు, మానవుని ఆత్మ యొక్క మరణం లేని నిత్యత్వ సిద్ధాంతానికి దారితీసింది ’ అని తదనంతరకాలంలో ఏంగెల్స్ రాశారు. మార్క్స్ తన డాక్టరేట్ చర్చా వ్యాసాన్ని , థీసిస్ గా ప్రకటించేటప్పుడు దానికి ముందు మాటలు ఎపిక్యూరిస్, ప్రొమేథియస్ లను జ్ఞానకాంతి తెచ్చినవారిగా గుర్తిస్తూ ‘ సాదా మాటల్లో చెప్పాలంటే నేను ఆదేముళ్ళ మూకను అసహ్యించుకుంటాను ’ అని ప్రొమేథియస్ తన అభిప్రాయాన్ని ఒప్పుకోవడం అన్నది, తత్వశాస్త్రం యొక్క స్వయాంగీకారం అనీ, అది మానవుని ఆత్మ చైతన్యాన్ని అత్యున్నతమైన దైవత్వంగా అంగీకరించని స్వర్గంలోని , నరకం లోని దేముళ్ళందరికీ వ్యతిరేకంగా తత్వశాస్త్రం యొక్క స్వయంగా చేసిన క్లుప్తమైన సూత్రీకరణ అని రాశారు.
మార్క్స్ తన డాక్టరేట్ కోసం వ్రాసిన చర్చా వ్యాసానికి అనుబంధంగా ఎపిక్యురస్‌కి వ్యతిరేకంగా ఫ్లూటార్ష్ రాసిన వివాదాస్పద వ్యాసంపై తన విమర్శనాత్మక పరిశీలనా వ్యాసాన్ని కూడా చేర్చాడు. ఈ విమర్శనాత్మక పరిశీలన ఒక ప్రత్యేక తరహాకు చెందినది. ఇది మేధస్సును మతధర్మశాస్త్రీకరించడానికి, తత్వశాస్త్రానికీ గల సంబంధం గురించి బలంగా చెప్పింది. ఎపిక్యురస్‌కు వ్యతిరేకంగా రాసిన వివాదాస్పద చర్చా వ్యాసం ద్వారా ఫ్లూటార్ష్ మతనైతికతనూ, తెలివైనసృష్టి వాదాన్ని ముందుకు తీసుకుపోవాలని చేసిన ప్రయత్నంలో ఆయన తత్వశాస్త్రాన్ని మతవేదికకు ముందున పెట్టాడు. మార్క్స్ , డేవిడ్‌హ్యూం పక్షం వహిస్తూ ప్రకృతి పట్ల హేతుబద్ధ వైఖరి గల తత్వశాస్త్రమే విజ్ఞానశాస్త్రానికి హక్కుదారైన రాజు అనీ, సహజమత ధర్మశాస్త్రం యొక్క శాస్త్రీకరింపబడిన మేధస్సు కాదని మార్క్స్ ప్రకటించాడు.
భగవంతుడిపట్ల ఉండాల్సిన అవసరమైన భయాన్ని తొలగించినందుకు గాను ఎపిక్యూరస్‌ను ఫ్లూటార్ష్ తీవ్రంగా విమర్శించాడు. అన్నిటికన్నా మరణానంతరం భయం అన్నది మానవులను భగవంతునికి కట్టిపడేసింది. అందుకే మార్క్స్ ఫ్లూటార్ష్ ను గురించి చెబుతూ అతడు, ‘ ఇంద్రియ సంబంధమైన చైతన్యానికి అధోలోకంలో సంభవించబోయే భయంకరమైన విషయాలను సమర్ధించే.................. భయంలో, నిర్దిష్టంగా అంతర్గతంగా ( మానవునిలో ) ఉన్న భయాన్ని ఆర్పజాలమనీ సమర్ధించే , సిద్ధాంతాలనూ వెల్లడించే ప్రతినిధి అనీ , ఈ సిద్ధాంతాలు మనిషిని ఒక జంతువుగా నిర్ణయించాయనీ ’ మార్క్స్ తన పరిశీలనలో పేర్కొన్నాడు.
ఫ్లూటార్ష్ యొక్క దేముడు , మార్క్స్ కు ‘ దిగజారిపోయిన దేముడు ’ . ఫ్లూటార్ష్ స్వయంగా ‘ సామాన్య ప్రజానీకం యొక్క నరకాన్ని’ గురించి బోధించే ప్రతినిధి. మార్క్స్ తన పరిశీలనలో ఫ్రెంచ్ భౌతికవాదీ, ఎపిక్యూరియన్ తత్వవేత్త అయిన డీహోలబాష్ యొక్క ‘ ప్రకృతి వ్యవస్థ ’ అన్న రచనలో చెప్పిన ఈ వ్యాఖ్యానాలను పేర్కొంటాడు. ‘ ప్రకృతిని మించిన అతీత శక్తి ఒకటి ఉందని, ఆ అతీత శక్తి ముందు హేతు, తర్కాలు మౌనంగా పడివుండాలనీ, ఆ అతీత శక్తి ముందు మనిషి తనకున్నదంతా త్యాగం చెయ్యడం ద్వారా ఆనందాన్ని పొందాలనీ , మానవులకు బోధించి అంగీకరింప చెయ్యడాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ’
‘ హేతు తత్వం లేకపోవడం వలన దేముడు ఉనికిలో ఉన్నాడు ’ అనీ, దేముడున్నాడు అని చూపించే ఆధారాలనబడేవాటన్నిటినీ మార్క్స్ కొట్టిపారవేశాడు.
ఈ చర్చావ్యాసంలో మార్క్స్ తనను హెగెల్ అభిప్రాయాలనుండి విడగొట్టుకున్నాడు. మార్క్స్ , ఏంగెల్స్‌లు తమ ‘ పరిత్ర కుటుంబం ’ అన్న రచనలో హెగెల్ యొక్క తత్వం ‘ ఆత్మకు - పదార్ధానికి , దేముడికీ – ప్రపంచానికి మధ్య గల విరుద్ధాంశాలను గురించిన జర్మన్ క్రిష్టియన్ పిడివాదం యొక్క ఊహాకల్పన యొక్క వ్యక్తీకరణ ’ అని తెలియ జేశాడు.
హెగెల్ యొక్క తర్కానికి మార్క్స్ ‘ పవిత్ర గృహం ’ అనే పేరు పెట్టాడు. వాన్‌లువీన్ ఎత్తిచూపినట్లు హెగెల్ యొక్క ఈ ‘ పవిత్ర గృహం ’ అన్నది మాడ్రిడ్ లోని రోమన్ కథోలిక్ మతగురువుల న్యాయసభ ‘ తమయొక్క కారాగారానికి పావనత్వం కలిగించి ’, ‘ భీభత్స గృహానికి ’ పవిత్రతను ఆపాదించినట్లుందని , మార్క్స్ తన ‘ హెగెల్ విమర్శనాత్మక పరిశీలన ’ లో పేర్కొన్నాడు. లుడ్విగ్ ఫాయర్‌బా యొక్క మతాన్ని గురించిన విమర్శనాత్మక పరిశీలన ప్రక్కప్రక్కనే మతంపై మార్క్స్ యొక్క స్వతంత్ర విమర్శనాత్మక పరిశీలన కూడా అభివృద్ధి చెందింది. హెగెల్ యొక్క ఆదర్శవాద తత్వాన్ని లుడ్విగ్ ఫాయిర్‌బా నిరాకరించిన విషయం మార్క్స్ పై గట్టి ప్రభావాన్ని పడేసింది.

Sunday, April 5, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 4

1837లో బేకన్‌ను చదవడం వల్లనే భౌతికవాదానికి , విరుద్ధంగా భావవాదాన్ని ఉంచే సమస్య మార్క్స్‌కు తట్టడం జరిగితే , ఆయన 1837 లో రీమారస్‌ను చదవడం వలన కూడా అటువంటి సమస్య ఆయన ఆలోచనలో తలెత్తిందని చెప్పడం ఎంతమాత్రం అబద్ధం కాదు. మార్క్స్ కాలం నాటికి , హెర్మన్ సామ్యూల్ రీమారస్ బాగా ఎరిగున్నవాడే. ఆయన తన ‘ సమర్ధన లేదా సహేతుకంగా భగవంతుని పూజించే వారిని సమర్ధిస్తూ ’ అన్న గ్రంధం నుండి సేకరించిన 1774 – 78 కాలం నాటి ఉల్ఫెన్ బట్టల్ ఫ్రాగ్మెంట్స్ అన్న గ్రంధం ఆయన మరణానంతరం ప్రచురించ బడింది. ఆయన హేతువాదానికి ప్రాతినిధ్యం వహిస్తూ , క్రీస్తును గురించి బైబులు వెల్లడించిన విషయాల యదార్ధత గురించి డీయస్టులు చేసిన విమర్శనే చేస్తూ , క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరాకరిస్తూ రాసిన ప్రాగ్మెంట్స్ అన్న గ్రంధం జర్మనీలో కలవరాన్ని సృష్టించింది. ఆ తర్వాతి శతాబ్దంలో డేవిడ్ స్ట్రాస్ రాసిన ‘ జీసెస్ జీవితం ’ అన్న గ్రంధానికి గొప్ప ఆదరణ లభించింది. రీమారస్ తర్కశాస్త్రం పై రాసిన గ్రంధం వల్ల ప్రధానంగా తాను అందరి ఎరుకలోకి వచ్చాడు. కానీ రీమారస్ 1754లో రాసిన ‘ సహజ మత ధర్మశాస్త్రం ’, ‘ పశువుల సహజ జ్ఞానం ’ అన్న రెండు ప్రధానమైన గ్రంధాలు మార్క్స్‌ కు ప్రధానంగా గుర్తుపెట్టుకునే గ్రంధాలయ్యాయి. జాన్ రే అనే ఇంగ్లీషు సహజమత ధర్మశాస్త్రజ్ఞునికి రీమారస్ అనుయాయుడు. రీమారస్ తన ‘ సహజ మతం యొక్క ప్రధాన వాస్తవాలు ’ అన్న గ్రంధంలో , పురాతన ఎపికరస్ వాదులు ‘ తెలివైన సృష్టి ’ని గురించి చేసిన విమర్శనాయుత పరిశీలనకు రీమారిస్ బలమైన ప్రతివాదనలు చేసి , ఆధునిక ఎపికరస్ వాదుల అశాస్త్రీయ వాదాలకు వ్యతిరేకంగా కూడా బలమైన ప్రతిపాదనలు చేసాడు. పరిణతి చెందిన రీమారస్‌కు పశువుల ప్రవర్తనకు సంబంధించిన వివరణ భగవంతుడు కానీ, అనుభవం కానీ వాటిని ప్రత్యక్షంగా కనబడని జ్ఞానాలలో ఎక్కడా కానరాలేదు. కానీ నిర్జీవమైన చోదకములు అనే భౌతికపరమైన వ్యవస్థలో అందుకు గల వివరణ కానవచ్చింది. రీమారస్ యొక్క ఈ ‘ చోదక వ్యవస్థల ’ సిద్ధాంతం మార్క్స్‌ పై ప్రముఖమైన ప్రభావాన్ని పడవేసింది. రీమారిస్ యొక్క ఈ అభిప్రాయంతో స్ఫూర్తిపొందిన మార్క్స్ , ఈ చోదక వ్యవస్థ సిద్ధాంతాన్ని మానవుల శ్రమను సహజవాస్తు శిల్పులైన తేనెటీగలతో పోల్చి ఇరువురి మధ్యగల ప్రత్యేక లక్షణాలను గుర్తించాడు. అయితే మార్క్స్ రీమారస్ కన్నా న్యూటన్ తరహాకు చెందిన దైవ విశ్వాసం ఉన్న మతాచారాల పట్ల విముఖత ప్రదర్శించే వాదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. మార్క్స్ న్యూటన్ విజ్ఞాన శాస్త్రపు సూత్రాలకు దృఢంగా కట్టుబడి ఉండటంతో న్యూటన్ పక్షానికే ( వాదనలలో ) చేరాడు. న్యూటన్ తన ‘ ప్రిన్సిపియా ’ అన్న రచనలో భగవంతుడే ప్రపంచానికి ఆత్మ అన్న భావాన్ని బలంగా నిరాకరించాడు. ‘ విశ్వపరిపాలకుడే ’ ఆత్మలన్నిటిపై ఆధిపత్యాన్ని కలిగివున్నాడు అన్న వాదనను న్యూటన్ వ్యతిరేకించాడు. న్యూటన్ తీసుకున్న ఈ వైఖరి అన్నది మతం వేరూ, విజ్ఞానశాస్త్రపు విషయ నిర్ణయాధికారం వేరు అన్న అంశానికి పాక్షికంగా గుర్తింపును ఇచ్చినట్టు అవుతుంది.
భౌతికవాదాన్ని గురించిన, సృష్టి పధకాన్ని గురించిన ఈ భావనలన్నీ ఢాక్టరేటు కోసం కారల్ మార్క్స్ వ్రాసిన చర్చా వ్యాసంలో వ్యక్తం చేయబడ్డాయి. ‘ ప్రకృతిని గురించి డెమోక్రటియస్ తత్వానికి ఎపిక్యూరిస్ తత్వానికి మధ్య గల వ్యత్యాసం ‘ అన్న మార్క్స్ యొక్క ఈ చర్చా వ్యాసం 1841 నాటికి పూర్తి చేయబడి ఆమోదించబడినది. ఈ వ్యాసంలో ఆయన ప్రధానంగా ఎపిక్యూరస్ తత్వాన్ని విశ్లేషించడం కోసం ఆయన డెమోక్రటిస్ తత్వాన్ని ఒక సాధనంగా చేసుకున్నాడు. మార్క్స్ యొక్క ఈ చర్చా వ్యాసం యొక్క ప్రధాన సారాంశమంతా ఎపికరియన్ అణువాదం లేదా భౌతికవాదపు సారాంశం అనీ, విశ్లేషణ హెగేలియన్ పద్ధతిలో గతి తార్కిక విశ్లేషణా విధానం అవలంబింప బడిందనీ, ఫలితంగా మార్క్స్ యొక్క తాత్విక దృష్టి ఆయన యొక్క ఆలోచనను భౌతికవాదం ఆదర్శవాదముల మధ్య జరిగే ఘర్షణకు అన్వయించడం వైపుకు ఆకర్షించబడింది అనీ ఎల్. థాపర్ అనే తత్వశాస్త్రజ్ఞుడు వివరించాడు.

Saturday, April 4, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 3

ఆ తర్వాత 1837 నవంబరులో బెర్లిన్ నుండి కార్ల్ మార్క్స్ తన తండ్రికి రాసిన ఉత్తరం పేర్కొన దగినది. ఈ ఉత్తరంలో ఆయన ఇప్పటికే పూర్తిగా జీర్నించుకున్న హెగెల్ తత్వంలోని “ విలక్షణమైన ఎగుడు దిగుడు శ్రావ్యత ” ను గురించి సంఘర్షణ పడడాన్ని , హెగెల్ విధానములోని భావవాదపు సారాంశాన్ని ప్రతిఘటించడాన్ని మనం గమనిస్తాం. “ గతంలో దేముళ్ళు భూమికి పైన ఉన్న లోకాల్లో నివసిన్తే , ఇప్పుడు ( హెగేల్ తత్వప్రకారం) భూమి వారి నివాస కేంద్రమైంది. ” అంటూ వ్రాశాడు. ఆరకంగా హెగేల్ తత్వం ‘ వాస్తవంలో నుండి భావాన్ని వెతుకుతుంది ’ అంటూ తనపై హెగేల్ భావం పూర్తిగా ప్రభావం కలిగియున్నప్పటికీ తాను అటువంటి భావంనుండి ‘ తన శత్రువు యొక్క బాహువుల్లోకి ’ అందించబడ్డాననీ, తాను ‘ అసహ్యించుకునే అభిప్రాయం యొక్క విగ్రహాన్నితయారు చేశాననీ ’ ఆ ఉత్తరంలో ఆయన రాశారు. అయితే ఆయన అదే సమయంలో యువ హెగేలియన్ల ‘ డాక్టర్స్’ క్లబ్బులో కూడా చేరాడు. అందులో హెగెల్ యొక్క తత్వాన్ని గురించి , మతాన్ని గురించిన విమర్శనాయుత పరిశీలన గురించే అనంతమైన చర్చలు జరిపాడు.
హెగేలియన్ తత్వం పై పడే సంఘర్షణల మధ్యలో మార్క్స్ ‘ అనుకూల అధ్యయనం ’ వైపు మళ్ళాడు. ప్రాన్సీస్ బేకన్ యొక్క జర్మనీకి చెందిన ప్రకృతి మత శాస్త్రవేత్త అయిన హెర్మన్ శామ్యూల్ రీమారస్ ల యొక్క రచనలను ఆయనపరిశీలించాడు. మార్క్స్ ఆలోచనపై బేకన్ యొక్క ప్రభావం చాలాకాలం పాటు ఉన్నదన్నది నిస్సందేహం. మార్క్స్ బేకన్ ను పూర్వకాలపు అణువాదులైన డెమోక్రటిస్ , ఎపిక్యూరస్ లకు ఆధునిక కాలపు భౌతికవాద ప్రతిరూపంగా పరిగణించాడు. 1830 దశకం చివరిలోనూ , 1940 దశకం మొదటి కాలం లోనూ , ఇంచుమించు ఒకే కాలంలో మార్క్స్ ,డార్విన్లు ఇద్దరూ బేకన్ యొక్క లక్ష్యాత్మకవాద వ్యతిరేక దృక్పధాన్ని సొంతంగా ఆమోదించి, అనుసరించారు. బేకన్‌యొక్క దృక్పథం , పూర్వకాలపు భౌతిక వాదుల భావంనుండి సంతరించకొన్నది. ‘ ప్రకృతి యొక్క మూలం అంతిమ కారణంలో ఉంది ’ అని భావించే ఏ అవగాహన అయినా ‘ భగవంతునికి దత్తం చేయబడ్డ కన్య ఏరకంగా పిల్లల్ని కనలేని గొడ్డుమోతురాలో , అటువంటి గొడ్డుమోతుది ’ అన్నదే పూర్వకాలపు భౌతికవాదుల దృక్పథం.
ఈ విధంగా వేల సంవత్సరాల కాలంగా , ప్రకృతికి భాష్యం చెప్పటం కోసం భౌతికవాదానికీ, భావవాదానికీ మధ్యా, విజ్ఞానశాస్త్రానికీ, భగవద్‌సృష్టివాదానికీ మధ్యా జరుగుతున్న మహత్తర సంఘర్షణ, బేకన్ యొక్క ఆలోచన ద్వారా , చిన్న వయసు లోనే మార్క్స్‌పై తన ముద్రను వేసింది. ఏంగెల్స్ చెప్పినట్లు 18వ శతాబ్దపు ప్రబోధాత్మక జ్ఞానోదయం “ క్రైస్తవ దేవుడికి బదులు మానవుడు ఎదుర్కొని ఘర్షణ పడాల్సిన సంపూర్ణ విషయంగా ప్రకృతిని అతడి ముందు నిలబెట్టింది. ” ఆవిధంగా ‘ పధకం ప్రకారం సృష్టి ’ ‘ లక్ష్యాత్మక వాదంపై ’ ఆధారపడ్డ ఇతర భావవాదపు వాదాలన్నిటి వాదాల తర్కంలోంచీ భౌతిక వాదం ఉద్భవించింది. ఈవిషయాన్నే ఏంగెల్స్ నిర్ణాయకంగా ఇలా చెప్పారు. “ దేముడు ప్రపంచాన్ని సృష్టించాడా ? లేక ప్రపంచం నిత్యమై శాశ్వితంగా ఉందా ? ”. ఈ ప్రశ్నకు జవాబులిచ్చిన తత్వవేత్తలు రెండు మహా శిబిరాలుగా విడిపోయారు. ఏదోఒక రూపంలో ప్రకృతికి ముందుగానే ప్రాణం ఉనికిలో ఉందనీ స్థిరంగా చెప్పే ( ఇటువంటి తత్వవేత్తల్లో ఒకరు హెగెల్. ఉదాహరణకు క్రిష్టియానిటీ చెప్పినదానికన్నా ఈ సృష్టి తరచుగా మరింత సంక్లిష్టమైంది, అసాధ్యమైనదిగా మారిపోతుంది అన్నభావం ) వారందరితో కూడి – భావవాద శిబిరంగా ఏర్ఫడింది. ప్రకృతే ముందుగా ఉనికిలో ఉందని పరిగణించే వివిధ తరహాల తత్వవేత్తలందరితో కూడి మరో శిబిరం – భౌతికవాద శిబిరం ఏర్పడింది. భావవాదం, భౌతికవాదం అన్న ఈ రెండు భావ వ్యక్తీకరణలు ప్రధానంగా ఇంతకు మించిన విషయాన్నీ, భావాన్నీ వ్యక్తం చెయ్యవు. అందువలన ఈ భావ వ్యక్తీకరణను ఇంతకు మించిన అర్ధంలో ఇక్కడ ఉపయోగించలేదు.

Tuesday, March 17, 2009

సృష్టివాదం – పరిణామవాదం -2

స్వర్గాన్ని గురించిన విమర్శనాత్మక పరిశీలన:
మార్క్స్ యూదు – లూథరన్ . దేముడున్నాడు కానీ అందుకు శృతి ప్రమాణం అక్కరలేదనే డీయిస్టు మత విశ్వాస వారసత్వం గలవాడు. అతని మాతా, పితాహులిద్దరూ ట్రయల్ పట్టణ శాఖకు చెందిన యూదు మత పండితులు , పురోహితులు. అతడి తండ్రి హెన్రిక్ మార్క్స్ 1817లో మార్క్స్ పుట్టటానికి ముందు కాలంలో లూథరన్ మతం లోకి మారాడు. ఆరకంగా లూథరన్ మతం లోకి మారకపోతే ఆయన ఆనాడు తన న్యాయవాద వృత్తి కొనసాగించడానికి వీలు లేకుండ ప్రష్యన్ ప్రభుత్వం నిషేధించి వుండేది. కార్ల్ మార్క్స్ యొక్క కాబోయే బావగారు అయిన ఎడ్గార్ వాన్ వెస్ట్ ఫాలెన్ మార్క్స్ తండ్రి హెన్రీ మార్క్స్ ను ‘ లెస్సింగ్ తరహా ప్రొటెస్టెంట్ ’ అని , మిక్కిలి భక్తి భావం గల డీయిస్టు గా మార బోతున్నాడనీ వివరించాడు. హెన్రీ మార్క్స్ జ్ఞానాన్ని పొందే వైఖరిని ఆశ్రయించాడనీ , వోల్టర్ రూసోల రచనలను కంఠతా పట్టి అప్పగించ గలిగే వాడనీ, తన కుమారుడైన కారల్ మార్క్సును “ సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడ్ని ప్రార్ధించవలసింది ” గానూ “ న్యూటన్ , లోకే, లీబ్నిజ్ ల విశ్వాసాలను అనుసరించమనీ ” కోరాడని తెలియజేశాడు. మార్క్సు తల్లి హెన్రిట్టా మతవిశ్వాసాలను గురించి వివరంగా తెలియదు. ఆమె ఎక్కువ మేరకు యూదు మత విశ్వాసాల పట్ల మొగ్గు చూపించింది. ఇందుకు కారణం ఆమెకు తల్లిదండ్రుల పట్ల నమ్రతాభావం. తన తండ్రి మరణించిన అనంతరం, కార్ల్ మార్క్స్ పుట్టిన ఒక సంవత్సరం అనంతరం ఆమె 1825 లో లూథరన్ క్రైస్తవ మతంలోకి మారి బాప్తీసాన్ని పొందింది. కార్ల్ మార్క్స్ తనకు భవిష్యత్తులో మామగారు కాబోయే బేరన్ లుడ్విగ్ వాన్ వెస్ట్ ఫాలెన్ సంరక్షణలోకి వెళ్ళాడు. ఆయనే మార్క్ కు చిన్నతనంలోనే ఊహాజనిత సోషలిస్టు అయిన సెయింట్ సైమన్ యొక్క భావాలను పరిచయం చేశాడు.
మార్క్స్ ‘ ఫెడరిక్ విల్హెమ్ జిమ్నాషియం ’ ట్రైర్ అనే పట్టణం లో గల హైస్కూలులో చదువుకున్నాడు. అది ఒక ‘ జేసూట్ ’ అనే క్రైస్తవ మత శాఖ కు చెందిన పాఠశాల. ఇందులో ఐదింట నాలుగు వంతుల మంది విద్యార్ధులు కేథలిక్కులే. మార్క్స్ తన 17 వ ఏట అంటే 1835లో ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసే పరీక్షలో భాగంగా 3 వ్యాసాలు రాయాల్సి వచ్చింది. అందులో ఒక వ్యాసం మత విషయాలకు సంబంధించినది. ఆయన “ జాన్ 15: 1 -14 ప్రకారం క్రీస్తులో మత విశ్వాసులు సంలీనమవటం – అందుకు గల ప్రాతిపదిక – సారాంశం , దాని పరిపూర్ణ ఆవస్యకత , ప్రభావాలు “ అన్న అంశం పై వ్యాసం రాశాడు. ఈ వ్యాసంలో ఆయన లూథరన్ శాఖ యొక్క త్రిమూర్తులకు చెందిన – క్రీస్తుతో సంలీనం కావాల్సిన ఆవస్యకతను గురించి చెబుతూ , అది చరిత్ర యొక్క లక్ష్యం అన్న వాదనను చేపట్టాడు. ఆయన తన వ్యాసాన్ని “ క్రీస్తుతో సంలీనం అన్నది ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఇటువంటి ఆనందాన్నే ఎపికురస్ వాదనా విధానం తనయొక్క అల్పమైన తత్వశాస్త్రం నుండి లేదా మరింత దాగిఉన్న లోతుల్లో ఉన్న జ్ఞానాన్ని ఆలోచించే వారి జ్ఞానం నుండి పొందటం కోసం నిస్ఫలమైన వృధా ప్రయాస చేస్తోంది ” అంటూ ముగించాడు. అంతకు ముందుగానే ఆయన క్రీస్తుకు విరుద్ధంగా ఎపిక్యూరస్ వాదులను నిలబెట్టి తన వాదనను కేంద్రీకరించడాన్ని బట్టి చూస్తే, తన యవ్వన దశలోనే మార్క్స్ ఎపకరస్ యొక్క భౌతిక వాదం పైన, పథకం ప్రకారం సృష్టి అన్న విషయం యొక్క విమర్సనాయుత పరిశీలన పైన ఆసక్తి పెంచుకొన్నాడనీ , అందువల్లనే ఆయన 6 సంవత్సరాల అనంతరం డాక్టరేటు కోసం రాసిన వివరణాత్మక చర్చా వ్యాసంలో గతంలో తాను ఎపిక్యూరస్ పట్ల తీసుకున్న వైఖరికి పూర్తి ప్యతిరేకమైన వైఖరి తీనుకొని “ పధకం ప్రకారం సృష్టి ” అన్న విషయంపై విమర్శనాయుత పరిశీలనా వైఖరి చేపట్టాడని మనకు అర్ధమౌతుంది. మార్క్స్ తన పాఠశాల వ్యాసం ( మతం గురించి ) రాసిన కాలంలోనే ‘ డేవిడ్ స్ట్రాస్ ’ తన క్రీస్తు జీవితేం అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఈ గ్రంథం వల్లనే మార్క్స్ మతాన్ని హెగేలియన్ పథ్థతిలో విమర్శనాయుతంగా పరిశీలన ప్రారంభించడానికి కారణమైంది. ( సరీగ్గా ఇదే కాలంలో జర్మనీలో రైల్వేలు ప్రవేశపెట్టబడ్డాయి. )

Friday, March 13, 2009

సృష్టివాదం – పరిణామవాదం -1

ఇటీవలికాలంలో సృష్టివాద ( భగవత్ సృష్టివాద ) సమర్ధకులు , ‘ తెలివైన సృష్టి ‘ వాద ఉద్యమపు ముసుగులో పరిణామవాద సిద్ధాంతాన్ని అమెరికన్ పబ్లిక్ స్కూళ్ళలో బోధించడానికి వ్యతిరేకంగా తమ దాడిని ముమ్మరం చేశారు. వీరు ‘వెడ్జ్ స్ట్రాటజీ ‘ అనబడే ‘వేరుపరచే వ్యూహం ‘ ద్వారా సమాజమంతటా విజ్ఞానశాస్త్రాన్ని, సంస్కృతినీ మార్చివేసే లక్ష్యంతో ఉన్నారు. క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి భగవత్ సృష్టివాదానికీ – భౌతికవాదానికీ మధ్యా, విజ్ఞానశాస్త్రానికీ – తెలివైన సృష్టికీ మధ్యా చర్చ సాగుతూనేవుంది. ఒక పధకం ప్రకారం ప్రకృతి సృష్టించబడిందనటానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయనీ, అందువలన ఒక సృష్టికర్త ఉన్నాడనే వాదన క్రీస్తు పూర్వపు 5వ శతాబ్దం నాటి , సోక్రటీసు కాలం నుండీ వాదించబడుతుంది. అందుకు వ్యతిరేకమైన భౌతికవాదన అంటే ప్రపంచాన్ని దానియొక్క స్వలక్షణాల పైననే – భౌతిక పరిస్తితుల, సహజసూత్రాల, అనిశ్చితత్వం, అత్యావశ్యకమైన దృగ్విషయాలపై ఆధారపడి సాగుతుంది తప్ప – అతీత శక్తి వలన ఏర్పడి సాగటల్లేదు అనే వాదన కూడా క్రీస్తు పూర్వపు 5వ శతాబ్దం నుండీ వాదించబడుతోంది. అణువాదులైన ల్యూపిప్పస్, డెమోక్రటస్ ల రచనల్లో ఈ భౌతికవాదం మొదలైంది. తర్వాతి కాలంలో క్రీస్తు పూర్వపు 3వ శతాబ్దంలో కోపిర్నకస్ ఈ భౌతికవాదాన్ని తెలివైన సృష్టి లేదా పథకం ప్రకారం సృష్టివాదంపై పూర్తిస్తాయి తాత్విక విమర్శనాత్మక పరిశీలనను అభివృద్ధి పరచాడు. ఆధునిక కాలంలో డార్విన్, మార్క్స్, ఫ్రాయిడ్ లు ‘ తెలివైన సృష్టి లేదా పథకం ప్రకారం సృష్టి ‘ అన్న వాదాన్ని భౌతికవాదంతో వ్యతిరేకించి ఖండించారు. అందువల్లనే నేటి ఆధునిక కాలపు ‘ తెలివైన సృష్టి వాద ‘ ఉద్యమకారులకు వీరు ప్రధాన శతృవులయ్యారు.
బయోమెడికల్ పరిశోధనా రంగంలో విశిష్టమైన సంస్థలు వున్న , బయో టెక్నాలజీ పరిశ్రమలు వర్ధిల్లుతున్న అమెరికాలో , ఆధునిక శాస్త్ర విజ్ఞానము జన్యు నిర్మాణ రహస్యాలను ఛేదించి డార్విన్ పరిణామవాద దృక్పధాన్ని బలపరుస్తున్న ఈరోజుల్లో అమెరికా దేశంలోనూ, బ్రిటన్ లోనూ డార్విన్ పరిణామవాదానికి వ్యతిరేకత మరింతగా పుంజుకుంటూ ఈ శాస్త్రీయమైన పరిణామ వాదాన్ని పాఠశాలల్లో బోధించరాదనే ధోరణులు ప్రబలుతూ , పరిణామవాద శాస్త్ర విజ్ఞాన బోధనలపై పలు ఆంక్షలను విధించే చట్టాలు చేయబడుతున్నాయి. 1925 అనంతర కాలం లోనే అమెరికా సుప్రీంకోర్టు “ పబ్లిక్ స్కూళ్ళ వ్యవస్థలో సృష్టి వాదాన్ని బోధించడమన్నది రాజ్యాంగ విరుద్ధం ” అంటూ తిరస్కరించినా మూడేళ్ళ క్రితమే పెనిసిల్వేనియా రాష్ట్రంలో ఒక ఫెడరల్ కోర్టు జడ్జి ‘తెలివైన సృష్టి ‘ వాదాన్ని , దానిని స్కూళ్ళలో బోధించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కొట్టివేస్తూ “ ఈ తెలివైన సృష్టి వాదం అన్నది సృష్టివాదం యొక్క బిడ్డే తప్ప వేరొకటి కాదు ” అని వ్యాఖ్యానించినా, అమెరికాలోని పబ్లిక స్కూళ్ళలో సృష్టివాదాన్న బోధించడానికీ పరిణామవాదానికి వక్రభాష్యం చెప్పడానికీ వివిధ రాష్ట్రాలలో చట్టాలు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
బ్రిటన్ దేశంలోని రాయల్ సొసైటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో డైరెక్టర్ గా ఉన్న ప్రొఫెసర్ రీస్ – పబ్లిక్ స్కూళ్ళలో సృష్టివాదం బోధించాన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడడాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేయడమే కాక – ఒకవేళ క్లాసులో సృష్టివాదం గురించి ఉపాధ్యాయులు లేవనెత్తదలుచుకుంటే వారు ‘సృష్టివాదం‘ ఏవిధంగా ‘విజ్ఞానశాస్త్రం‘ కాదో .. ‘పరిణామవాదం‘ ఏవిధంగా ‘విజ్ఞానశాస్త్రమో‘ విద్యార్ధులకు వివరించాలి – అంటూ ప్రతిపాదించాడు.
2009, ఫిబ్రవరి 12 నాటికి పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ కు 200 సంవత్సరాలు నిండుతాయి. ఆయన రాసిన ‘జీవుల పుట్టుక ‘ రచనకు కొద్ది నెలల్లోనే 150 సంవత్సరాలు నిండుతుంది. ఇవి విజ్ఞానాన్వేషుల్లో ఉద్వేగం నింపే సందర్భాలు.
ప్రస్తుత తరుణంలో సృష్టివాదం – పరిణామవాదముల గురించి కారల్ మార్క్స్ చేసిన విమర్సనాత్మక పరిశీలన గురించి తెలుసుకోవడం అన్నది విజ్ఞాన అన్వేషకులకు ఉపయుక్తంగా ఉంటుంది.

Tuesday, January 20, 2009

కాశ్మీరు పై కామ్రేడ్ ఏ.కే.ఘోష్ ప్రశ్నలకు సమాధానం

తమ స్థాయి స్థితిని పరిష్కరించుకొనే అవకాశం ప్రజలకివ్వటమూ, ఐరాస లేదా దాని వెనుక నున్న ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదుల జోక్యాన్ని నివారించటమూ కాశ్మీరు సమస్య పరిష్కారానికి కేంద్ర అంశాలని మేము భావిస్తున్నాము.
భారత పాకీస్తానులు నిర్యుద్ధ ఒప్పందం పై సంతకాలు చెయ్యాలని , ఐరాస నుండి కాశ్మీరు సమస్యను ఉపసంహరించాలని , దేశం నుండి ఐరాస ప్రతినిధి వెళ్ళిపోవాలనీ , శాంతియుతంగానూ, ప్రజాస్వామ్యయుతంగానూ, కాశ్మీరు సమస్యకు పరిష్కారం కనుగొనాలనీ భారత కమ్యూనిష్యుపార్టీ కేంద్ర కమిటీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కాశ్మీరు సమస్య పరిష్కారాన్ని సరీగ్గానే చెప్పింది.
కాశ్మీరు సమస్య పరిష్కారంలో అమెరికా బ్రిటీషు సామ్రాజ్యవాదుల జోక్యానికి తగిన భూమిక నేర్పరస్తుంది గనుక ఐదు పెద్ద దేశాల పర్యవేక్షణలో ప్లబిసైట్ ( జనాభిప్రాయసేకరణ ) ను సమర్ధించటం సరైంది కాదు.
కాశ్మీరు ప్రజల ప్రయోజనాలు , ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకుంటూ కాశ్మీరు భారత్లో చేరాలా లేక స్వతంత్రంగా ఉండాలా అన్నదానిని రాజ్యాంగ సభ నిర్ణయించాలనీ భారత కమ్యూనిష్టు పార్టీ అధికారికంగా ప్రకటించాలి. దీనితో పాటే భారత్ లో చేరే నిర్ణయాన్ని కాశ్మీరు ప్రజలూ, రాజ్యాంగ సభ తీసుకునే విధంగా భారత కమ్యూనిష్టు పార్టీ అన్ని చర్యలూ తీసుకోవాలి.
రాజ్యాంగ సభ సమావేశమవటానికి షరతుగా కాశ్మీరు నుండి భారత పాకీస్తాను సైన్యాలు వైదొలగాలన్న డిమాండును ప్రస్తుతానికి పెట్టరాదు.
కాశ్మీరు సమస్యపై కమ్యూనిష్టు పార్టీ తన వైఖరిని నిర్ణయించుకునే టప్పుడు , పాకీస్తాన్ పాలకుల వైఖరి కంటే షేక్ అబ్దుల్లా ,భారత ప్రభుత్వాల వైఖరి ప్రజాస్వామిక శిబిరానికి ఆమోదకరమన్న అంశాన్ని పరిగణన లోనికి తీసుకోవాలి. కాశ్మీరు పాకీస్తానులో చేరితే , అది కాశ్మీరు బానిసత్వానికి, ఈ ప్రాంతంలో అమెరికా సామ్రాజ్యవాదం పెరగడానికి దారి తీస్తుంది.
సాయుధ బలంతో కాశ్మీరును కలిపేసుకునేందుకు పాకీస్తాను ప్రయత్నిస్తే , పాకీస్తానుకు భారత సైనిక సమాధానాన్ని పాకీస్తానుకు వ్యతిరేకంగా కాశ్మీరు విముక్తికి సైనిక సహాయంగా పేర్కొంటూ మద్దతు తెలపాలి.
-జె.స్టాలిన్
కేంద్ర కమిటీ కార్యదర్శి

Friday, January 16, 2009

1951లో భారత పాకీస్తాన్ సంబంధాల గురించి

కామ్రెడ్ స్టాలిన్ కు,
భారత పాకీస్తాన్ సంబంధాలను గురించి భారతదేశం నుండి ఏ.కే.ఘోష్ నుండి అక్టోబర్ 5వ తేదీన అందిన లేఖనూ, దానితోపాటు డాంగే నుండి రాజేశ్వరరావునుండి అందిన లేఖలను ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి మీకు పంపిస్తున్నాను.
కాశ్మీరు సమస్యపై సిపిఐ విధానాన్ని ఏ.కే.ఘోష్ వివరించారు. పోలిట్ బ్యూరో , కేంద్రకమిటి సభ్యులలో ఉన్న భిన్నాభి ప్రాయాలను తెలిపారు. కాశ్మీరు సమస్య పై మన పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయాన్ని తెలుపమని కోరారు.
ఈ లేఖపై సూచనలను తరువాత పంపుతాను.
ఇట్లు,
ఆల్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ( బోల్షివిక్ )
కేంద్ర కమిటీ విదేశాంగ విధాన కమీషన్ అధ్యక్షులు వి.గ్రిగోరియన్
5 అక్టోబరు 1951.
------------------------------------------

భారత- పాకిస్తాన్ సంబంధాల గురించి.
భారత- పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో బాగా తీవ్రమయ్యాయి. ప్రస్తుతం తీవ్ర ప్రమాద స్థాయికి చేరాయి.
కాశ్మీరు సమస్య చుట్టూ ఘర్షణ పెరుగుతుంది. ఈ వివాదపు చరిత్రలోకి వెళ్ళి వివరించవలసిన అవసరం లేదు. ఒకరిపై మరొకరిని భారత్-పాకీస్తాన్లను సామ్రాజ్యవాదులెలా రెచ్చగొట్టారో కాశ్మీరు పై అదుపును పొంది, దానిని రష్యా చైనాలకు వ్యతిరేకంగా సైనిక స్థావరంగా వినియోగించుకొనేందుకు భారత- పాకిస్తాన్ల మధ్య ఘర్షణలు ఎలా రేపెట్టారో తెలిసిన విషయమే.
మధ్యవర్తిత్వం నెరుపుతామన్న ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనను భారత్ ఫిబ్రవరిలో తిరస్కరించిన విషయము తెలిసిందే. షేక్. అబ్దుల్లా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలో వయోజనులందరూ ఓటర్లుగా ఎన్నికల ద్వారా ఏర్పడే రాజ్యాంగ నిర్ణాయక సభ కాశ్మీరు ప్రభుత్వరూపాన్ని భారత- పాకిస్తాన్లలో దేనిలో చేరాలన్న అంశాన్నీ నిర్ణయిస్తుందని షేక్. అబ్దుల్లా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
వెనువెంటనే రాజ్యాంగ నిర్ణాయక సభ భారత ప్రభుత్వం చేతిలో పనిముట్టని , అది చేసే నిర్ణయాలన్నీ చట్ట విరుధ్ధమైనవిగా పరిగణిస్తామని పాకీస్తాన్ పాలకులు ప్రకటించారు. షేక్. అబ్దుల్లా రాజ్యాంగ సభను ఏర్పాటు చేయటాన్ని కాశ్మీరు ప్రజలపై దురాక్రమణ చర్యగా పరిగణిస్తామని, అన్నివిధాల దాన్ని ప్రతిఘటిస్తామని, “ స్వతంత్ర పాకీస్తాన్ “ప్రభుత్వపూ, పాకీస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలోని “ ప్రభుత్వపూ “ నాయకులు ప్రకటించారు.
ఇలాంటి హెచ్చరికలున్నప్పటికీ రాజ్యాంగ సభ ఏర్పాటుకు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికలు సెప్టెంబర్ లో జరుగవలసివుంది.
ఈ పరిస్తితులలో డాక్టర్. గ్రాహం ను , అతని బృందంలోని సైనికాధికారులను ,సలహాదారులనూ “ అతిధులుగా “ భారత ప్రభుత్వం ఆహ్వానించింది.
ఢిల్లీ, కరాచీ, సింగపూర్ లలో గ్రహం పర్యటించాడు. భారత పాకీస్తాన్ల మధ్య సైనిక ఉద్రిక్తత సృష్టించటంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. గ్రాహం రాక నాటినుండి పాకిస్తాన్ పాలకుల ప్రకటనలు మరింత శతృపూరితంగా ఉన్నాయి. పత్రికల్లో, రేడియోలో బహిరంగంగానే “ జీహాద్ ” ( ధర్మయుద్ధం ) పిలుపులి0చ్చారు. పాకిస్తాను సరిహద్దుల వద్ద కందకాలు త్రవ్వడం, నగరాలలో బ్లాక్ అవుట్లద్వారా యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టారు. భారత పత్రికల్లోని ఒక సెక్షను , అభివృద్ధి నిరోధక సంస్ధ హిందూ మహాసభలు కూడా పాకీస్తాన్ పై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఏమైనప్పటికీ యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ పూనుకోలేదు.
ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వానికి భారత ప్రభుత్వాన్ని బలవంతంగా ఒప్పించాలన్న లక్ష్యం తోనే పాకీస్తాన్ బెదిరింపుల విధానం సాగిందన్నది స్పష్టమే. ఈ అడుగు వేసే విధంగా పాకీస్తాను ను ఆంగ్లో-అమెరికా సామ్రాజ్యవాదులు నెట్టారు. విభజనరేఖకు ఇరువైపులా , తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంట భారత్ పాకీస్తానులు సాయుధబలగాలను మోహరించాయి. చాలా భాగంలో ఈ సాయుధ బలగాలు ఎదురు బొదురుగా నిలిచి ఉన్నాయి. పశ్చిమ సరిహద్దులో ఎక్కువగా సైనిక సమీకరణ జరిగింది.
ఇటీవల విడుదల చేసిన నెహ్రూ,లియాకత్ ఆలీఖాన్ ల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలనుండి ఈ క్రింది విషయాలు స్పష్టమౌతున్నాయి :
1. భారత భూభాగం పై దాడి చెయ్యనని హామీ ఇవ్వటానికి పాకీస్తాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే కాశ్మీరు లోని ఏభాగాన్నయినా “ భారత భూభాగం ” గా గుర్తించేందుకు నిరాకరించింది.
2. కాశ్మీరును బలంతో ఆక్రమించే ఉద్దేశ్యం పాకీస్తానుకుందనటాన్ని ఇది తెలుపుతున్నట్లు భారత ప్రభుత్వం పరిగణించింది. ప్రస్తుతం భారత సాయుధబలగాల ఆధీనంలో ఉన్న కాశ్మీరు భాగం పై దాడి జరిగితే, దానిని భారత భూభాగంపై జరిగిన దాడిగా పరిగణించి , భారత-పాకీస్తాన్ సరిహద్దు వెంట మొత్తంగా యుద్ధం ప్రారంభిస్తానని భారత ప్రభుత్వం ప్రకటించింది.
వాస్తవంగా చూస్తే, యుద్ధం జరగబోదని నమ్మకంగా చెప్పవచ్చు. కానీ ఏహఠాత్పరిణామాలకైనా పార్టీ సిద్ధంగా ఉండి, ఈ సందర్భానికి తగిన విధానాన్ని రూపొందించుకొని వుండాలి.
ఈ క్రింది అంశాలపై పార్టీలో పూర్తి అంగీకారం ఉంది:
1. సహాయం కోసం తమ దరికి చేరే విధంగా భారత, పాకీస్తాన్ ల మధ్య సైనిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధానాన్ని సామ్రాజ్యవాదులు పాటిస్తున్నారు. దీనివల్ల ఈ దేశాలలో వారి ప్రభావం పెరుగుతుంది.
2. ఐ.రా.స. మధ్యవర్తిత్వాన్ని భారత్ తో బలవంతంగా ఒప్పించేందుకు సామ్రాజ్యవాదులు సృష్ఠించిన సైనిక ఉద్రిక్తతలను చల్లార్చేందుకు పార్టీ పోరాడాలి.
3. యుద్ధాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో సాగే ప్రచారాన్నంతటినీ వ్వతిరేకించడం పార్టీ కర్తవ్యంగా వుండాలి. సామ్రాజ్యవాదులే యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారనీ, చివరకీ వారే లాభపడతారనీ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. యుద్ధమంటే ఇరుదేశాల ప్రజలకూ నష్టం.
4. కాశ్మీరు సమస్యను కాశ్మీరు ప్రజలు ప్రజాస్వామికంగా పరిష్కరించుకోవాలి. కాశ్మీరు సైనిక విభజనను అంతం చేయడానికి భారత పాకీస్తానులు అంగీకరించాలి. భారత లేక పాకీస్తానులో చేరేసమస్యను స్వేచ్ఛగా పరిష్కరించుకునే అవకాశాన్ని సంస్ధాన ప్రజలందరికీ ఇవ్వాలి.
ఈ మౌలిక అంశాలపై , అభిప్రాయాలలో ఐక్యత ఉన్నప్పటికీ , తక్షణమే తొలగించుకోవాల్సిన విభేదాలు ఇంకా ఉన్నాయి. ఈ క్రింది అంశాలపై విభేదాలు తలెత్తాయి.
కాశ్మీరు సమస్యపై సాయుధ ఘర్షణ జరిగితే మనమిచ్చే నినాదం ఎలావుండాలి ?
బెర్లిన్ ప్రకటనకనుగుణంగా , మొదటిగా బలాన్ని ప్రయోగించిన దేశాన్ని దురాక్రమణదారునిగా ప్రకటించాలని పోలిట్ బ్యూరోలోని మెజారిటి కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు : ఈ కామ్రెడ్ల ప్రకారం ఎక్కడైనా ( కాశ్మీరు తో సహా ) ఏదేశమైనా సాగించే దాడిని తిప్పికొట్టే హక్కు భారత్ కు ఉందని మనం ప్రకటించాలి. అయితే ఎట్టి పరిస్తితులలోను పాకీస్తాన్ భూభాగాన్ని భారత్ ఆక్రమించరాదు.
పోలిట్ బ్యూరోలోని ఒక సభ్యుడు , కేంద్ర కమిటీ లోని ఇద్దరు ఇలా అభిప్రాయపడ్డారు : దాడి జరిగితే భారత ఆత్మ రక్షణ అన్న నినాదం భారత్ లోని అభివృధ్ధి నిరోధక శక్తులకు ఉపయోగపడుతుంది ; నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్ధించినట్లవుతుంది. మొదటిగా దాడి ఎవరు చేశారన్నది నిరూపించటం సాధ్యం కాదనీ, కనుక సామ్రాజ్యవాదుల పోటీలో భాగంగా ఇరు ప్రభుత్వవిధానాలనూ ఎండగట్టాలనీ , ఇక్కడకు మనం పరిమితమై ఉండాలనీ ఈ కామ్రెడ్లు గట్టిగా వాదించారు. భారత పాకీస్తాను ప్రభుత్వాలపట్ల వున్న విభిన్న అంచనాల నుండే పార్టీలో ఈ విభేదాలు పుట్టాయి.
ఇరు ప్రభుత్వాలూ సామ్రాజ్యవాదంతో షరీకయ్యేవే అయినప్పటికీ , పాకీస్తాన్ ప్రభత్వం ఎక్కువగా ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రభావంలో వుందనీ, భారత పాకీస్తాను ప్రభుత్వాల విధానాలను సమానంగా చేసి చూడడం పొరపాటవుతుందనీ పోలిట్ బ్యూరోలోని మెజీరిటీ కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు. కాశ్మీరుకున్న వ్యూహాత్మక భౌగోళిక స్తానాన్ని దృష్టిలో పెట్టుకొని సామ్రాజ్యవాదులు ఐరాస వొప్పందం ద్వారా కాశ్మీరును పాకీస్తాన్లో కలపాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనీ, కాశ్మీరు భారత్ లో చేరేకంటే పాకీస్తాన్ లో చేరితే తమకెక్కువ అదుపు ఉంటుందని వారిలా చేస్తున్నారనీ పోలిట్ బ్యూరోలోని మెజారిటీ కామ్రెడ్లు వాదించారు. ఐరాస చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన వైఖరిని భారత్ పున:పరిశీలించేవిధంగా వత్తిడి చేసేందుకే యుద్ధోన్మాదం రెచ్చగొడుతున్నారని ఈ కామ్రెడ్లు వాదించారు. కాశ్మీరు పై పాకీస్తాను సాగించే దాడిని త్రిప్పికొట్టే హక్కు భారత ప్రభుత్వాని కుందని , పాకీస్తాను భూభాగాన్ని అది ఆక్రమించరాదని ఈ కామ్రెడ్ల వాదన.
అవకాశముంటే వీలైనంత త్వరలో ఈ సమస్యపై మీ అభిప్రాయాన్ని తెలుసుకో గోరుతున్నాము.
కాశ్మీరు సమస్యపైనే తగినంత స్పష్టతా , అభిప్రాయాల్లో ఐక్యతా లేవు. ఈ క్రింది ప్రశ్నలు మాముందున్నాయి.
1. కాశ్మీరు భారత్ లో చేరాలా లేక స్వతంత్ర దేశంగా ఉండాలా?
2. ఐక్య సంస్థానానికి స్వేశ్చగా ఎన్నికైన రాజ్యాంగ సభ సమావేశానికి ప్రాథమిక చర్యగా భారత పాకీస్తాన్లు తమ సాయుధ బలగాలను ఉపసంహరించాలని పార్టీ డిమాండ్ చెయ్యాలా?
3. కాశ్మీరు ప్రజల అభిష్టానికి అనుగుణంగా , శాంతియుతంగా , పరస్పర అంగీకారంతో భారత పాకీస్తాన్లు కాశ్మీరు సమస్యను పరిష్కరించాలని మనం ప్రకటించాలా ? లేక ఐదు పెద్ద దేశాల పర్యవేక్షణలో ప్లబిసైట్ నిర్వహించాలన్న డిమాండును ముందుకు తేవాలా?
కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉండాలని , దాని సార్వభౌమత్వానికి పొరుగు దేశాలైన భారత , పాకీస్తాన్, సోవియట్ యూనియన్ , చైనా, ఆఫ్ఘనిస్తాన్ లు హామీ యివ్వాలని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. దీనికి స్వతంత్ర కాశ్మీరు అమెరికా సామ్రాజ్యవాదుల ప్రభావంలో పడుతుందన్న ఆలోచనతో పోలిట్ బ్యూరో లోని మెజారిటీ కామ్రెడ్లు అభ్యంతరాలు తెలుపుతున్నారు.
కాశ్మీరు నుండి సాయుధబలగాలను భారత పాకీస్థాన్ లు ఉపసంహరించాలన్న డిమాండు ప్రస్తుత సమయంలో తగినది కాదని పోలిట్ బ్యూరో లోని మెజారిటీ కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు.
ఏ రూపంలోనూ ఐరాస మధ్యవర్తిత్వం లేకుండా కాశ్మీరు సమశ్యను భారత పాకీస్తాన్లు పరిష్కరించుకోవాలని పోలిట్ బ్యూరో లోని మెజారిటీ సభ్యుల అభిప్రాయం.
ఇట్లు,
అజయ్ కుమార్ ఘోష్
05-అక్టోబరు- 1951 .