Monday, August 10, 2009

కరవు కోరలు సాచుతున్నా పట్టించుకోని పాలకులు:

పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్,బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావ పరిస్తితులేర్పడ్డాయి. అల్పపీడనంతో పడ్డ చెదురుమదురు వర్షాలతో రాయలసీమ రైతులు వేరుశనగ వేసి బిందెలతో నీళ్ళు తెచ్చి పోసినా పంట ఎండిపోతుంది. గుండెపగిలి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
కరవు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. పరిస్థితి ఆందోళన కరంగా లేదని కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ లోక్సభలో ప్రకటించారు. మాయవతి మాత్రం ఉత్తరప్రదేశ్ లో 47జిల్లాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి, కేంద్రం నుండి 80వేల కోట్ల రూపాయల సహాయాన్ని కోరింది. ప్రతి ఏడాదీ వరదలూ, వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నా, తక్షణ సహాయచర్యలందించే బాధ్యతనుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు పూనుకుంటుంది. కనుక కరవుతో కుదేలైన రైతాంగాన్ని ప్రభుత్వం కొత్త ఆశలు కల్పించి కాంట్రాక్టు సాగు వైపు , బడా బూర్జువాల పరిశ్రమలకు ముడిసరుకుగా వాణిజ్య పంటలవైపుకు మళ్ళించబూనుకునే ప్రయత్నంఉందన్న అనుమానం కలుగుతుంది.

3 comments:

Praveen Mandangi said...

గ్రామీణ ప్రాంతం వాడు MLA అయినా పదవి వచ్చిన తరువాత పట్టణంలో ఆస్తులు సంపాదించుకుంటాడు. ఈ రాజకీయ నాయకులు కరువు లాంటి సమస్యల గురించి పట్టించుకుంటారా?

ప్రవీణ్ ఖర్మ said...

పట్టణ ప్రాంతంవాడు MBBS చదివి పల్లేటూర్లో పకోడీలు అమ్ముకుంటాడు. అంతే గానీ నాకున్న సమస్య గుర్తించగలడా

ప్రవీణ్ ఖర్మ said...

ఇప్పటికైనా గ్రహించారా నేనెంత దిక్కుమాలిన వెధవనో.