Saturday, May 2, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 7

భూమిని గురించిన విమర్శనాత్మక పరిశీలన:
ప్రపంచాన్ని మానవీయ , పాదార్ధిక, శాస్త్రీయ అవసరాలకు అనుగుణంగా అన్ని సమయాల్లోనూ అవగాహన చేసుకోవడానికి వీలుగా మార్క్స్ చేసిన మతంపై చేసిన విమర్శనాత్మక పరిశీలన అమర్చ ( రూపొందించ ) బడింది. రెండు గతితార్కిక ఉద్యమాల వలన మతపరమైన పరాయీకరణపై చేసిన విమర్శనాత్మక పరిశీలన , లౌకిక ప్రపంచం యొక్క పరాయీకరణపై విమర్శనాత్మక పరిశీలన చేయడానికి దారితీసింది. 1. ఎపిక్యురస్ , ఫ్యూర్‌బాలు మతంపై జరిపిన విమర్శనాత్మక పరశీలనల నుండి , మానవ ప్రపంచాన్ని మతం పరాయీకరించిందని , అందువలన మానవ స్వేచ్ఛకు విలోమత్వం సంభవించిందనీ – ఈ విమర్శనాత్మక పరిశీలన మత ధర్మశాస్త్రం నుండి భావవాద తత్వశాస్త్రం వరకూ ( హెగెల్ జరిపినట్లు) విస్తరించబడిందనే విషయం నిశ్చయమైంది. 2. అదేవిథంగా ఈ విమర్శనాత్మక పరిశీలన స్వచ్ఛమైన తీవ్ర ఆలోచన జరిపే భౌతికవాద/ మానవీయ విమర్శనాత్మక పరిశీలనలకు విస్తరించిందనీ ఇంతవరకు ఆ పరిశీలనలు భూమిని గురించి ముందుగా అనుకున్న విధంగా ( అంటే భౌతిక , చారిత్రక వాస్తవాల గురించి ) జరిగిన విమర్శనాత్మక పరిశీలనలు కావనే విషయం నిశ్చయమైంది.
అందువలన నాస్తిక వాదం ఫ్యూర్‌బా యొక్కతీవ్ర ఆలోచనా రాజ్యం, ఆకాశంలోనే మిగిలిపోతే అది సరిపోనిదిగానూ, నిజమైన అర్ధాన్ని ఇవ్వనిదైన అర్ధ విహీన అంశంగానూ, కేవలం మానవీయ తత్వశాస్త్రాన్ని అభివృద్ధి పరచడానికి ఒక మొదటి మెట్టుగానూ ఉంటుంది. ఒక ఆదర్శంగా నాస్తిక వాదం చాలా మేరకు నైరూప్యమైనది అని మార్క్స్ నొక్కి చెప్పాడు. అది దేముడ్ని లేడని ఖండించడం ద్వారా మానవుని యొక్క ఉనికిని నిశ్ఛయముగా నొక్కి చెబుతుంది. ఆ రకంగా భావవాదనాస్తికవాదం కేవలం సైద్ధాంతిక మానవతావాదాన్ని కూడి ఉందని కార్ల్ మార్క్స్ వ్రాశాడు.
ఒక భౌతికవాదిగా మార్క్స్ దేముడి యొక్క మతం యొక్క నైరూప్యత పైన తన ఆలోచనను పెట్టడానికి ఎంచుకోలేదు. అదే సమయంలో ఆయన దేముడి యొక్క అతీతమైన ఉనికిని లేదని ఋజువు చెయ్యలేదు. అలా చేయడంవలన అది వాస్తవ , అనుభవపూర్వకమైన ప్రపంచానికి అతీతంగా ఉంటుంది. దానికి సంజాయిషీ ఇవ్వడం సాధ్యం కాదు. హేతువు ద్వారా, పరిశీలన ద్వారా, శాస్త్రీయ విచారణ ద్వారా ఆవిషయానికి జవాబు తేల్చటం సాధ్యం కాదు. ఇందుకు బదులుగా అన్ని పరిమితులలోనూ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి వీలైన ఒక చారిత్రక భౌతికవాద వైఖరికి తన శాస్త్రీయ నిబధ్ధత ద్వారా ఒక ఆచరణాత్మక నాస్తికత్వాన్ని ఆయన రూపొందించాడు. ఆచరణాత్మకంగా భగవంతుణ్ణి లేడని ఖండించడం , మానవత్వ శాస్త్ర విజ్ఞానాలను ధృవీకరించి చెప్పడమన్నవి , విప్లవ కరమైన సామాజిక మార్పు కోసం , మానవాభివృధ్ధి కొనసాగింపు కోసం, మానవ శక్తి సామర్ధ్యాల పెరుగుదల, సామర్ధ్యాలను వృధ్ధి చేయడం కోసం మరియు స్వేచ్ఛను అభివృద్ధి చెయ్యడం కోసం ఒక క్రియాశీలకమైన ఉద్యమాన్ని డిమాండ్ చేసాయి.

4 comments:

Praveen Mandangi said...

ప్రభాకర్ సాంజ్ గిరి గారు వ్రాసిన "మనిషి కథ" పుస్తకం చదివారా? అందులో కూడా సృష్టివాదాన్ని విబేధించే వ్యాసాలు ఉన్నాయి.

vakumar07 said...

చదవలేదండి. ఆ పుస్తకం సంపాదించడానికి ప్రయత్నిస్తాను.

రాజశేఖర రాజు said...

మనిషి కథ అనే ఈ పుస్తకం ప్రజాశక్తి బుక్ షాపులో దొరుకుతుంది చూడండి. విశాలాంధ్రలో కూడా ప్రయత్నించండి. మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నా. నిజం చెప్పాలంటే బిత్తరపోయాను. నమ్మిన సిద్ధాంతానికి ఇంత కమిటెడ్‌గా, నిరంతరాయంగా ప్రచారం చేయడమా.. చాలా బాగుంది. నిబద్ధ రచనలతో బ్లాగ్ నిర్వహించడం ఎలాగో మీరే తొలి పాఠం నేర్పారు. కలగూరగంపలాంటి నా బ్లాగులు కూడా వీలైతే చూడండి. మీ బ్లాగును ఇకనుంచి రెగ్యులర్‌గా ఫాలో అవుతాను..

raju123.mywebdunia.com (old)
blaagu.com/mohana (old)
chandamamatho.blogspot.com (new)
chnadamama-raju.blogspot.com (new)

Anonymous said...

bhoutikavaadaanikunna vistruti Marx viswavyapitam chesaru. enaati e prapancha abhivrudhilo daani paatranu masibusi maredukaaya cheyalanukune vaariki javabu idi. tama adhikaaraanni nilupukunenduku mataanni vaadukuntunnavaallu kuda lopayikaariga angikarinche vishayamidi. marinta pracharam avasaram.
Please see my blog sahavaasi-v.blogspot.com