Tuesday, April 6, 2010

ప్రజా విప్లవ పంధా యోధుడు కామ్రెడ్ కానూ సన్యాల్

షహీద్, భగత్ సింగ్, సుఖదేవ్ లు అమరులైన 79వ వర్ధంతి రోజునే నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కామ్రెడ్. కానూ సన్యాల్ మనల్ని వీడిపోయారు. 65 యేళ్ళ సుదీర్ఘ కమ్యూనిష్టు ఉద్యమ చరిత్ర ఉన్న కామ్రెడ్ సన్యాల్ 1928లో మధ్యతరగతి ఉద్యోగి కుటుంబంలో జన్మించారు.ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు.తెలంగాణా, తెభాగా పోరాటాల ప్రభావంతో వామపక్ష భావాలవైపు ఆకర్షితుడై సన్యాల్ విద్యార్ధి ఉద్యమ నేతగా ఎదిగి కమ్యూనిష్టు పార్టీ నిర్మాణంలోనికి 1950 ఆరంభంలో వచ్చారు.కార్మిక సంఘాల కార్యకలాపాలతో పార్టీలో కొనసాగారు. 1959 నుండి ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీలో ఆదివాసీ రైతు సంఘనాయకుడిగా పనిచేశాడు. 1963లో సిపిఐ (ఎం) వైపు ఉన్నారు.1967 మే 25 న ఉధ్భవించిన నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్. తెలంగాణా సాయుధ పోరాటంలో విడిచిపెట్టిన - భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం అనే ప్రజాయుధ్ధపంధాలో నడిచాడు.1969 ఏప్రియల్ 22న సి.పి.ఐ. (ఎం.ఎల్) ను ప్రకటించాడు.పార్వతీపురం హత్య కేసులో ముద్దాయిగా అరెష్టయి 6 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. తన మొత్తం రాజకీయ జీవితంలో 14 ఏండ్లకుపైగా జైలు జీవితాన్ని, 7సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని గడిపి 13సంవత్సరాల క్రితం గుండెనొప్పితో అనారోగ్యంపాలయ్యాడు.2సంవత్సరాల క్రితం పక్షవాతంలో బాధపడుతూ 6 నెలలకు పైగా సిలిగురి ఆసుపత్రిలో చికిత్స పొందారు.
కామ్రెడ్.కానూ సన్యాల్ మరణం భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి, మిత అతి వాదాలకు వ్యతిరేకమైన ప్రజా విప్లవ పంధా కు తీరని నష్టం. ఆయన విడిచివెళ్ళిన కర్తవ్యాలను పరిపూర్తి చేయడానికి కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.

3 comments:

Anonymous said...

ఇలాంటి వురేసుకుని కుక్క చావు చచ్చే దేశద్రోహులను, పిచ్చికుక్కల్ను యోధులని పిలిచే దగుల్భాజీలను చెప్పుతో నివాళించాలి.

Anonymous said...

బాగా చెప్పారు

Anonymous said...

సన్యాలు ఒక సన్నాసి బుచికి బుచికి యోధుడు.
అన్నా ఉరేసుకున్నాడే సన్యలు
అన్నా బయలెల్లినాడే.

ఈ అడవిలో దున్నలను పొగిడేవాల్లు పిచ్చోల్లు.